రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవిని విపరీతంగా అభిమానిస్తాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చరణ్ తీసుకున్న ఒక నిర్ణయం చిరంజీవి 150వ సినిమాకు సమస్యగా మారుతుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ తరువాత నటించబోయే సినిమా పై క్లారిటీ వచ్చేసింది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘తనీ ఒరువన్’ కు చరణ్ పచ్చ జెండా ఊపడమే కాకుండా సురేంద్రరెడ్డిని డైరెక్టర్ గా ఫిక్స్ చేసాడు.

సమాజంలోని అవినీతి అంతం చేయడానికి ప్రయత్నించే పోలీసు ఆఫీసర్ పాత్రను చరణ్ ఈసినిమాలో పోషిస్తున్నాడు. ఈసినిమా అంతా రాజకీయాలు అవినీతి చుట్టూ తిరుగుతుంది. అయితే చిరంజీవి 150వ సినిమాగా త్వరలో ప్రారంభం కాబోతున్న ‘కత్తి’ సినిమా కూడ రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. కార్పోరేట్ కంపెనీలకు రైతుల భూములను కట్టబెట్టే  విషయంలో జరుగుతున్న అవినీతిని ‘కత్తి’ ప్రశ్నిస్తుంది.

ఈవిధంగా చూస్తే రాజకీయాల చుట్టూ అవినీతి చుట్టూ తిరిగే కథల నేపధ్యం ఈ రెండు సినిమాలకు ఉండటమే కాకుండా ప్రస్తుత రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఉండే పంచ్ డైలాగులు ఈ రెండు సినిమాలలోను ఉండబోతున్నాయి. దీనితో ఒకే రాజకీయ నేపధ్యం ఉన్న కథలను చరణ్ చిరంజీవిలు ఒకేసారి ఎందుకు ఎంచుకున్నారు అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.

ఇంచుమించు ఒకే సమయంలో మొదలుయ్యే ఈసినిమాలు రెండూ భారీ బడ్జెట్ తో తీయడమే కాకుండా రాబోతున్న సమ్మర్ ను టార్గెట్ చేసుకుంటూ నిర్మాణం కాబోతున్నాయి. అయితే ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఇచ్చే మెగా కుటుంబం ఇప్పుడు తమ పద్ధతి మార్చి ప్రజలకు సందేశాలు ఇచ్చే హీరోలుగా మారుతున్నారా? అనే సెటైర్లు పడుతున్నాయి. చిరంజీవి వయస్సు రీత్యా ‘కత్తి’ సినిమాలోని ఈపాత్ర చిరూకు సరిపోయినా చరణ్ సందేశాలు ఇస్తే అభిమానులు సహిస్తారా అన్నదే సందేహం..


మరింత సమాచారం తెలుసుకోండి: