మెగాస్టార్ చిరంజీవి వారసులుగా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్. వరసకు వీరిద్దరు బావాబామ్మర్థులు అవుతారు..అయితే ఒకప్పుడు చిరంజీవి, అల్లు అరవింద్ ఎంతో స్నేహంగా ఉండేవారు..ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు..ఇక జంద్యాల దర్శకత్వం వహించిన సినిమా ‘చంటబ్బాయి’ చిత్రంలో వీరిద్దరు చేసే ఫన్నీ ఫైటింగ్ సీన్లు కడుపుబ్బా నవ్వించాయి.

ఈ తరం హీరోలు అల్లు అర్జున, రాంచరణ్ లు కూడా చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగారు..సమయం దొరికితే చాలు ఒకరి గరించి ఒకరు పోగడ్తలతో ముంచెత్తుతారు. ఈ ఇద్దరు మెగాస్టార్ వారసులుగా చిత్ర రంగానికి వచ్చినప్పటికీ ఎవరి ఇమేజ్ తగ్గట్లు వారు ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా బన్నీ తన బావమర్ధి  చెర్రీ కోసం పెద్ద త్యాగమే చేశాడు..చరణ్ నటిస్తున్న  మూవీ కి 'బ్రూస్ లీ ' ది ఫైటర్ అనే ట్యాగ్ లైన్ ను తో టైటిల్ ఖరారు చేశాడు..అయితే బ్రూస్ లీకి ఫైటర్ అనే ట్యాగ్ లైన్ రావడం వెనుక అల్లు అర్జున్ చేసిన ఫేవర్ ఎంతో ఉందని మెగా హీరోలకు సన్నిహితంగా ఉండే వాళ్లు చెబుతున్నారు.


'బ్రూస్ లీ ' పోస్టర్


ఫైటర్ టైటిల్ నచ్చి స్నేహితులతో రిజిస్టర్ చేయించిన బన్నీ, బావ అయిన చెర్రీని ఆనందపెట్టడానికి ఆ  టైటిల్ ను త్యాగం చేశాడట.. తాజాగా బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సినిమాకు ఫస్ట్ ది ఫైటర్ అని పెట్టాలనుకున్నారట..కానీ చివరికి  'సరైనోడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు... బ్రూస్ లీ కోసం తనకు ఇష్టమైన టైటిల్‌ను వదులుకున్నబన్నీకి రామ్ చరణ్ ఎలాంటి సహాయం చేస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: