రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.  తెలుగు లో కూడా ఈ రేంజ్ లో సినిమాలు తీసి ప్రపంచ స్థాయిలో రికార్డులు కురిపించడం అనేది సామాన్య విషయం కాదు..ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తెలుగు ఇండస్ట్రీ కి మంచి క్రేజ్ వచ్చింది.

ఇక ఈ సినిమా కోసం ప్రభాస్,అనుష్క తమ స్వంత లైఫ్ కూడా త్యాగం చేశారట..బాహుబలి పార్ట్ 1 తీసేటపుడు ఇద్దరికీ అంటే ప్రభాస్ వాళ్ల పెదన్నాన్న, అనుష్కకు వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిశ్చయించారట..ఇక ప్రభాస్ కి భీమవరంలో ఇంజనీరింగ్ అమ్మాయితో వివాహం నిశ్చయం అయినట్లు కూడా వార్తలు వచ్చాయి..ఇకపోతే అనుష్క కు ఓ పారిశ్రామిక వేత్తతో వివాహం నిశ్చయించినట్లు వార్తలు వచ్చాయి.. కానీ ఈ ఇద్దరూ బాహుబలి సినిమా పూర్తి అయిన తర్వాతే పెళ్లి అని చెప్పారట.. బాహుబలి సినిమా వచ్చింది.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది... కానీ ఇప్పుడు బాహుబలి 2షూటింగ్ మొదలైంది.. దీంతో పెళ్లి తతంగం మళ్లీ వాయిదా వేశారట.

బాహుబలి చిత్రంలో ప్రభాస్


బాహుబలి 2షూటింగ్ కంప్లీట్ చేసాక ప్రభాస్ ,అనుష్క లు పెళ్లి చేసుకోనున్నారట ! గతకొంత కాలంగా ప్రభాస్ పెళ్లి వార్తలు వినబడుతూనే ఉన్నాయి ,ఇక అనుష్క సైతం 30ప్లస్ సుందరి కాబట్టి ఆమె పెళ్ళికి కూడా ఇంట్లోవాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు .మొత్తానికి బాహుబలి2 షూటింగ్ కంప్లీట్ చేశాక అనుష్క పెళ్లి చేయడానికి ఇంట్లోవాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట,ఓ బిజినెస్ మాన్ ని కూడా చూసారట ! అలాగే ప్రభాస్ కు కూడా పెళ్లి చేయడానికి పెద్దనాన్న కృష్ణంరాజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఉభయ గోదావరి జిల్లా లకు సంబందించిన అమ్మాయిని ప్రభాస్ కోసం వెదుకుతున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: