మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. మరో వారంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి కాబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించని రిలీజ్ డేట్ అక్టోబర్ 16న ఉండటంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివీటీస్ ని చిత్రయూనిట్ భారీగా చేస్తుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన నెక్ట్స్ సినిమాకి సైన్ చేసిన విషయం తెలిసిందే.


తమిళంలో సూపర్ హిట్ మూవీ అయిన ‘తని ఒరువన్’ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అన్నదానిపై గత కొంత కాలంగా రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి క్రేజీ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. కమర్షియల్ వాల్యూస్ తో మూవీలను తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, తని ఒరువన్ రిమేక్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.


రామ్ చరణ్ సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రూస్ లీ రిలీజ్ అనంతరం, నవంబర్ లో ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయటం జరుగుతుంది. ఇక డిసెంబర్ చివరి వారం నుండి ఇది సెట్స్ మీదకు వెళ్ళే ఛాన్స్ ఉంది.


డివివి దానయ్య – ఎన్.వి ప్రసాద్ కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. కిక్2 తో ఆశించినంత సక్సెస్ ని ఇవ్వలేకపోయిన సురేందర్ రెడ్డి, ఆల్రెడీ గ్రాండ్ సక్సెస్ సాధించిన తమిళ మూవీ రిమేక్ ని సెలక్ట్ చేసుకొని సేఫ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: