కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన మూవీ ‘పులి’. తాజాగా ఈ మూవీ అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అందరూ భావించినట్టుగా ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని అనుకున్నారు. కానీ మూవీ రిలీజ్ అనంతరం కథలో దమ్ములేక పోవటంతో కేవలం గ్రాఫిక్స్ కోసమే సినిమాని చూడాల్సిన పరిస్థితి వచ్చింది.


ఇక రిలీజ్ విషయంలో జరిగిన గంధరగోళం కారణంగా, ఇప్పటికీ ఈ మూవీ ఘోరంగానే నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, చెన్నైలో మంచి కలెక్షన్స్ సాధిస్తున్నప్పటికీ, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో ‘పులి’ మూవీకి కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.


ఇక రిలీజ్ సమయంలో “మూవీ అవుట్ పుట్ బాగుంది, రేటు ఎక్కవయినా మూవీని కొనచ్చు” అంటూ విజయ్ డిస్ట్రిబ్యూటర్స్ కి హామీ ఇచ్చాడంట. ప్రస్తుతం ‘పులి’మూవీ అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ లక్షల్లో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.


ఈ కారణంగా విజయ్ ని నష్టపరిహారం అడుగుతున్నారు కొందరు డిస్ట్రిబ్యూటర్స్. ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలో అర్ధం కాక, విజయ్ తన ఫోన్ ని స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. త్వరలోనే విజయ్ ఫారిన్ ట్రిప్ వెళ్ళి, కొంత ప్రశాంతత పొందాలని చూస్తున్నాడంట.



మరింత సమాచారం తెలుసుకోండి: