కండలవీరుడు బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్‌ ఎంతోమంది హీరోయిన్స్ కు వారి కేరియర్ కు సంబంధించి లిఫ్ట్ ఇవ్వడంతో పాటు వారిని ప్రేమించి మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ అనుభవాలకు మించిన ఒక విచిత్ర అనుభవం సల్మాన్ కు ఎదురైంది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

సల్మాన్ ఖాన్ దగ్గరకి అతడి అభిమానులమంటూ అతడి దగ్గరకు వచ్చిన నలుగురు అమ్మాయిలు సల్మాన్ వాలెట్, సన్ గ్లాసెస్, పెండెంట్ కొట్టేసారు అంటూ బాలీవుడ్ మీడియాలో షాకింగ్ బయటకు వచ్చింది. జరిగిన మోసాన్ని సల్మాన్ ఖాన్ గ్రహించే లోపే ఆ నలుగురు అమ్మాయిలు అక్కడ నుంచి జారుకున్నట్లు టాక్. 

ఆశక్తికరంగా మారిన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే  ఈ మధ్య  సల్మాన్ ఖాన్ బాంద్రలోని ఓ నైట్ క్లబ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నలుగురు అమ్మాయిలు సల్మాన్ దగ్గరికి వచ్చి తాము అంతా సల్మాన్ ఫ్యాన్స్ అంటూ పరిచయం చేసుకుని సల్మాన్ ను పొగడటం ప్రారంభించారట. దీనితో మన కండల వీరుడు మంచి జోష్ లోకి వెళ్ళిపోయినట్లు టాక్. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తన కూర్చున్న టేబుల్ పై తన వాలెట్, సన్ గ్లాసెస్, బజరంగీ భాయి జాన్ చిత్రంలో వాడిన పెండెంట్ ఉంచాడట. సల్మాన్ ఖాన్ ను మాటల్లో పెట్టిన ఆ నలుగురు అమ్మాయిలు సల్మాన్ దృష్టి మరల్చి ఆ వస్తువులతో జారుకున్నట్లు టాక్. ఈ విషయo గ్రహించిన సల్మాన్ సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని సలహా ఇచ్చినప్పటికీ సల్మాన్ ఖాన్ అందుకు నిరాకరించినట్లు టాక్.

ఈ సంఘటన తరువాత ఇటీవల జుహులోని ఓ హోటల్‍‌ కు సినిమా ప్రోమో విడుదల చేయడానికి వచ్చిన సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ముంబాయి అంత సేఫ్ సిటీ కాదు ఎప్పుడు ఏమైనా జరుగవచ్చు అని వ్యాఖ్యానించాడట. దీనిని బట్టి సల్మాన్ ఆ నలుగురు అమ్మాయిలు  ఎంతటి షాక్ ఇచ్చారో అర్ధం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: