తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఇలయదళపతి విజయ్. ఈ మద్య విజయ్ సినిమాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి..ఇదే ఊపుపై భారీ బడ్జెట్ తో  సోషియో ఫాంటసీ చిత్రం ‘పులి’ తీశారు. ఈ సినిమా మొదటి నుంచి బాలారిష్టలతోనే ముందుకు వెళ్లింది..ఆ మద్య సినిమాలో స్టోరీ లీక్ అయ్యిందని.. సినిమాలో కొన్ని సీన్లు లీక్ అయ్యాయని రక రకాల పుకార్లు సోషల్ నెట్ వర్క్ లో చక్కర్లు కొట్టాయి. ఇక సినిమా రేపు విడుదల అవుతుందీ అనుకున్న సమయంలో పులి చిత్ర యూనిట్ పై ఆదాయపన్ను శాఖ వారు రైడ్ చేశారు. దీంతో సినిమా అనుకున్న సమయం కంటే కాస్త లేట్ అయ్యింది..దీంతో బెన్ ఫిట్ షోలో క్యాన్సల్ అయ్యాయి.

ఇక సినిమా విడుదలైన తర్వాత నెగిటీవ్ టాక్ వచ్చింది..దీంతో చిత్ర యూనిట్ మొత్తం ఢీలా పడ్డారు. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సైతం ఇలాంటి సినిమా విజయ్ ఎలా ఒప్పుకున్నాడని ఆశ్చర్య పోతున్నారు. పరిస్థితి చూస్తుంటే సినిమా నిర్మాతలకు భారీ నష్టాల తప్పేలా లేవు.తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

 ఇక తమిళ స్టార్ రజనీకాంత్‌ మాత్రం ఈ సినిమా చాలా బావుందంటూ ప్రశంసించారు. విజయ్ పెర్ఫార్మెన్స్‌పై, శ్రీదేవి యాక్టింగుపై పొగడ్తలు గుప్పించారు. ‘పులి’ మూవీ గ్రేట్ వండర్ అంటూ విజయ్ ని ఆకాశానికి ఎత్తేశాడు. ‘సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఇంతటి భారీ బడ్జెట్ తో తెరకెక్కించటం అనేది నిజంగా సాహసమే. కానీ, అభిమానుల నుండి వస్తున్న రెస్పాన్స్ నిజంగా సూపర్భ్. ఇంతటి ఘనమైన చిత్రాన్ని అందించిన విజయ్ కి థన్యవాదాలు.’ అంటూ చెప్పుకొచ్చాడు.  వ్యక్తిగతంగా ఫోన్ చేసి తమను అభినందించారని సమాచారం.

‘పులి’ చిత్రం పోస్టర్


ఇప్పుడు  ఈ సినిమాపై ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తుంది. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి, ‘పులి’ గ్రాండ్ సక్సెస్ అంటూ ఢంకా వాయిస్తుంది. ఎక్కడా నెగిటివ్ టాక్ అనేది లేకుండా ‘పులి’ మూవీపై పాజిటివ్ ఫీలింగ్స్ ని ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తుంది ‘పులి’ యూనిట్. మరో వైపు  తమన్నా కూడా విజయ్ పెర్మెన్స్‌పై ప్రశంసలు గుప్పించింది. తమిళ యాక్టర్ జయం రవి, మరో తమిళ నటుడు జీవ తదితరులు పులి సినిమాపై, విజయ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నారు. ఓ వైపు నెగెటివ్ టాక్, మరో వైపు స్టార్ల ప్రశంసలు వస్తున్నా హీరో విజయ్ మాత్రం చాలా భాదలో ఉన్నట్లు తెలుస్తుంది.. పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన సినిమాపై నీళ్లు చల్లితే ఎవరి పరిస్థితి అయినా ఇంతేఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: