జ‌బ‌ర్ధస్త్ కామెడీ షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల‌ను ఆకట్టుకున్న హాట్ యాంకర్ అనసూయ మాటలతో మాయచేస్తుంది.. కొన్ని కారణాల వలన జ‌బ‌ర్ధస్త్ ప్రొగ్రామ్ నుండి అన‌సూయ‌ను తప్పుకున్నా ఆ ప్రోగ్రామ్  ఆమెకు మంచి ప‌బ్లిసిటీని తెచ్చిపెట్టింది. తెలుగులో ఉన్న యాంకర్ లలో హాట్ గా కనపడి వెంటనే ఆకట్టుకునే వారు ఎవరంటే కళ్ళు మూసుకుని అనసూయ పేరే చెప్తారు. పెళ్ళై బిడ్డల తల్లి అంటే నమ్మనట్లుగా ఉండే ఫిజిక్ తో తన అందమైన నవ్వుతో బుల్లి తెర ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తుంది అనసూయ. ఈ అమ్మడు  తన అందంతో, వాక్చాతుర్యంతో బుల్లితెరపై, స్టేజ్ షో‌ల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ యాంకర్ అనసూయ కోసం డైరెక్టర్స్ ఎగబడుతున్నారట.

 ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న మేటి యాంకర్ అనసూయ సైతం, ఒకవైపు స్మాల్ స్క్రీన్ లో అలరిస్తూనే, మరోవైపు సిల్వర్ స్క్రీన్ లో అవకాశాల కోసం ప్రయయ్నాలు చేస్తుంది.  తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడు నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటిస్తుంది..ఇప్పటికే  వీరిద్దరికి సంబంధించిన డ్యాన్స్ స్టిల్ ఒకటి విడుదలైంది..ఈ స్టిల్ అనసూయ నాగ్ పక్కన భలే డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది..ఇకపోతే  ఈ మూవీతో మరిన్ని ఆఫర్స్ ని వరించే అవకాశం ఉందని అంటున్నారు.

యాంకర్ అనసూయ


మరోవైపు ఓ మూవీసంస్థ అనసూయ ప్రధాన పాత్రగా సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అంతే కాకుండా మరో యంగ్ హీరో సరసన కూడా సెకండ్ హీరోయిన్ గా చాన్సు వచ్చిందట..అయితే ఈ సినిమాలో ఓ ట్విస్ట్..ఇప్పటి వరకు అనసూయ వంపు సొంపులు చిట్టిపొట్టి డ్రెస్సులు, చీరకట్టులోనే చూశారు...ఈ సినిమాలో అనసూయ బికినీలో కనిపించనున్నదని పుకారు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అనసూకు  సిల్వర్ స్క్రీన్ ఆఫర్ల మీద ఆఫర్ల రావడం ఖాయం అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు..


మరింత సమాచారం తెలుసుకోండి: