డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్లీ బ్యాంకాక్ వెళ్ళాడట. తను తీయబోయే సినిమా కథ కోసం పూరి బ్యాంకాక్ వెళ్లి రాసుకోవడం పూరికి అలవాటే. అయితే ప్రస్తుతం పూరి వెళ్లింది ఏ హీరో కోసం కథ రాయడానికని కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ఓ పక్క చిరంజీవి 150వ సినిమా నేనే చేస్తా ఆ అధికారం నాకే ఉందని చెప్పిన పూరి ప్రస్తుతం చిరుకి నచ్చని సెకండ్ ఆఫ్ పూర్తి చేయడానికి వెళ్లాడని సంకేతాలు వస్తున్నాయి.


అయితే మెగాస్టారేమో తన 150వ సినిమాగా కత్తి రీమేక్ చేస్తున్నట్టుగా చెప్పేశాడు. అయితే దానికి మాత్రం వినాయక్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారు. పూరి తన బర్త్ డే రోజు చెప్పినట్టుగా చిరుతో 150వ సినిమా చేయకపోయినా 151వ సినిమా అయినా తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నానని చెప్పాడు పూరి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే చిరు 151వ సినిమాకు కచ్చితంగా పూరినే దర్శకుడయ్యే అవకాశం ఉంది.


అయితే ఓ పక్క మాత్రం పూరి వెళ్లింది తను నెక్స్ట్ కన్నడ హీరోతో కమిటైన రోగ్ సినిమా రాయడానికని కొందరు అంటున్నారు. సినిమా కథ కోసం ఒంటరిగా బ్యాంకాక్ వెళ్లి సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న పూరి మరి వెళ్లింది ఏ కథ రాయడానికనేది వస్తేనే కాని తెలియదు. ఇక ఫిల్మ్ నగర్లో మాత్రం పూరి చిరు సినిమా చేసేదాకా కథని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంటాడనే అంటున్నారు.

రోగ్ కథ రాయడానికే వెళ్తే పూరి తిరిగి రాగానే ఆ సినిమాను స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆ సినిమాకు టైం తీసుకుంటే ప్రస్తుతం బ్యాంకాక్ లో రాసేసి చిరు సినిమా కథే అని 
ఫిక్స్ అయిపోవచ్చు. మరి చిరు సినిమా కోసం పూరి చేస్తున్న ఈ ప్రయత్నం ఎందాక సక్సెస్ అవుతాయో చూద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: