సినిమాల పరిధి పెరుగుతున్నా కొలది ప్రాంతీయ సినిమాలే కాదు, అన్ని భారతీయ సినిమాలు దేశదేశాలు విస్తరిస్తున్నాయి. అలానే మన యాక్టర్స్ కూడా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్స్ కూడా బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే బాలీవుడ్ నుండి హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇర్ఫాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, టాబు, ప్రియాంకా  చోప్రా, నర్గీస్ ఫక్రి లాంటి మేటి బాలీవుడ్ యాక్టర్స్ అక్కడ నటించి సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ హాట్ అండ్ స్వీట్ కత్రినా కైఫ్ కి వచ్చిందనే వార్తలు వచ్చాయి. జాకీ చాన్ సినిమాలో కత్రినా కైఫ్ చేస్తున్నట్టు అపట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ఆఫర్ ఇప్పుడు హాట్ బెబ్ ఇలియానా దక్కించుకుందట.
   
మార్కెట్ ఎక్పాండ్ అవుతున్న ఈ తరుణంలో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా ప్రాంతీయ చిత్రాలను తీయడానికి ముందుకొస్తున్నారు. అయితే రీసెంట్ గా హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ సినిమాలో ఇలియానాకు భారి ఆఫరే వచ్చిందట. అయితే ఆమె చేసేది మాత్రం లీడ్ రోల్ కాదని వినికిడి. 'కుంగ్ ఫూ యోగా' అనే చాన్ సినిమాలో ఇల్లి బేబీ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట. మొదట ఈ రోల్ కి కత్రినాను అనుకున్నా సడెన్ గా ఈ ఆఫర్ ఇలియానా ముంగిట వాలింది.


స్టాంగ్ లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో ఇలియానా చైనీస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా నటిస్తుందని బీ టౌన్ లో హడావిడి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే అమ్మడి అందాలకు హాలీవుడ్ ఫ్యాన్స్ కూడా మతులుపోగొట్టుకోక తప్పదు. లండన్ నుండి వచ్చిన హాలీవుడ్ ఛాన్స్ రావడం మంచి తరుణమే అని ఆనందపడుతున్నారు ఆమె సన్నిహితులు.


అయితే కత్రినా నుండి ఈ ఆఫర్ తనకు రావడం పట్ల సంతోషంగా ఉన్న గోవా బ్యూటీ.. ఈ చాన్స్ రావడం వెనుక ఏదన్నా మతలబు చేసిందా అన్న ఆలోచనలు వస్తున్నాయి. అసలే అమ్మడు ఎప్పటినుండో ఓ ఫారిన్ ఫోటో గ్రాఫర్ తో ప్రేమాయణం సాగిస్తున్న వాదనలు ఉన్నాయ్. మరి అతని సహకారంతో అమ్మడు ఈ ఆఫర్ ని చేజిక్కించు కుందని వార్తలు వస్తున్నాయి అసలు నిజమేమిటో త్వరలోనే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: