మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ ‘బ్రూస్ లీ’. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ తో వస్తున్న చిత్రం ‘బ్రూస్ లీ’. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన సీన్స్ ని చిత్రీకరించిన చిత్రయూనిట్, ఇక చివరగా రామ్ చరణ్ పై ఓ సాంగ్ ని  షూట్ చేసి ‘బ్రూస్ లీ’ మూవీకి గుమ్మడికాయ కొట్టనున్నారు.


ఇదిలా ఉంటే, బ్రూస్ లీ మూవీకి సంబంధించిన బిజినెస్ ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ తో నడించిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ కి సైతం మంచి డిమాండ్ పలుకుతుందని అంటున్నారు.గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు బ్రూస్ లీ ఓవర్సీస్ రైట్స్ ని భారీ మొత్తంగా చేజిక్కించుకున్నారు.


అంతే కాకుండా ఈ మూవీ ఓవర్సీస్ లో 350కి థియోటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. అమెరికా నుండి అందిన సమాచారం మేరకే బ్రూస్ లీ మూవీ నార్త్ అమెరికాలోనే 220కి పైగా థియోటర్స్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు వారు అక్కడ ఎక్కువుగా ఉండటంతో, కేవలం వారం రోజుల్లోనే కలెక్షన్స్ ని క్యాచ్ చేయాలనే ఉద్ధేశంతో గ్రేడ్ ఇండియా ఫిల్మ్ వారు ఇలా భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


గతంలో చిరంజీవికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటించటంతో, మూవీకి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అధిరేలా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇక అక్టోబర్ 16న సినిమా రిలీజ్ కి టెక్నికల్ గా ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇందులోరామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: