తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నిటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత వెండితెరపై కనిపించనే లేదు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్..ఈ సినిమాలో కామెడికి కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు.

‘గబ్బర్ సింగ్‌’ లో అంత్యాక్షరి ఎపిసోడ్ ప్రేక్షకులను  ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా  చెప్పనక్కరలేదు. కొంత కాలం వరకు టీవీ షోలో కూడా ఈ ఎపిసోడ్ దుమ్మురేపింది..అప్పటి వరకు విలన్ వేషాలతో ఎవరూ గుర్తించని గబ్బర్ సింగ్ గ్యాంగ్ మంచి వెలుగులోకి వచ్చారు.. 'గబ్బర్’ బ్యాచ్‌గా… 'గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్‌’ పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కడమే కాకుండా, తదనంతరం వారికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'  లో కూడా ఓ అంత్యాక్షరి ఎపిసోడ్ ను ప్లాన్ చేయాలని దర్శకుడు బాబీకి చాలా కాలం క్రితమే పవన్‌ సూచించారట ! దీంతో, బాబీ తీవ్రంగా శ్రమించి ఈ సినిమా   కోసం ఓ 'అంత్యాక్షరి ఎపిసోడ్’ ను  కొత్తగా డిజైన్ చేశాడట.

‘గబ్బర్ సింగ్‌’ లో అంత్యాక్షరి ఎపిసోడ్


గతంలో అంత్యాక్షరి లోకనిపించిన నటీనటులతో పాటు కొత్త వారు కూడా కనువిందు చేయనున్నారట. ఈ ఎపిసోడ్‌ లో రౌడీ గ్యాంగ్‌ తో పాటు పవన్ చేత కూడా అదిరిపోయే మాస్ స్టెప్పులు వేయించేందుకు దర్శకుడు బాబీ ప్లాన్ చేశారని యూనిట్ వర్గాల అంటున్నాయి. ‘గబ్బర్ సింగ్’ అంత్యాక్షరి ఎపిసోడ్ అంటే మంచి క్రేజ్ ఏర్పడటంతో ఈ సారి వచ్చే అంత్యక్షరి సీన్ పవన్ అండ్ రౌడీ గ్యాంగ్ ఏ రేంజ్ లో నవ్వించ బోతున్నారో వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: