స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఏ వ్యక్తి పైన అయినా సెటైర్లు వేస్తే ఆ సెటైర్ కు నవ్వని వారు ఉండరు. అల్లుఅర్జున్ అందరితోను చాల స్నేహంగా ఉంటాడు. అందువల్లనే అతడికి స్నేహితులు ఎక్కువ. ఇక కండల వీరుడు రానా అల్లుఅర్జున్ చిన్ననాటి నుండి స్నేహితులు కావడంతో లేటెస్ట్ గా ‘రుద్రమదేవి’ ప్రమోషన్ కు సంబంధించిన మీడియా మీట్ లో ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. వినడానికి ఆ సెటైర్లు చాల ఆశక్తిగా అనిపించాయి. 

ఇక వివరాలలోకి వెళితే ‘రుద్రమదేవి’ ప్రమోషన్ మీడియా మీట్ లో రానా మాట్లాడుతూ రుద్రమదేవితో రొమాన్స్ చేసే చాళుక్య వీరభద్రుడిగా నటించినప్పుడు తాను చాల కష్టపడ్డానని అంటూ ఈమధ్య కాలంలో నెగిటివ్ పాత్రలు బాగా చేస్తూ ఉండటంతో రొమాంటిక్ ఫీలింగ్స్ చూపించడానికి ఇబ్బంది పడ్డానని కామెంట్స్ చేసాడు రానా. 

అయితే తాను బన్నీ చిన్నప్పటినుండి పెళ్లయ్యే వరకూ తన డైరీలో తన లవ్ లైఫ్ గురించి రాసుకున్నాడని అది చదివిన జ్ఞాపకాలు తనకు గుర్తుకు రావడంతో ఆ విషయాలను గుర్తుకు చేసుకుంటూ అందులోంచి ప్రిపేర్ అయ్యి ‘రుద్రమదేవి’ తో లవ్ సీన్లు, రొమాన్స్ సీన్లు చేశానని రానా కామెంట్స్ చేసాడు.

అదే వేదిక పై రానా పక్కనే కూర్చుని రానా చెపుతున్న మాటలు అన్నీ నవ్వుతూ విన్న బన్నీ రానా నాడైరీ చదివాడు కాని తనలా ప్రేమించి ఇప్పటికీ ఎవ్వర్నీ ధైర్యంగా పెళ్ళిచేసుకోలేకపోతున్నాడు అని అల్లుఅర్జున్ రివర్స్ పంచ్ వేసాడు. ఆపంచ్ కి రానా ఏ కాకుండా ‘రుద్రమదేవి’ ప్రమోషన్ మీట్ కు వచ్చిన మీడియా ప్రతినిధులు అంతా తెగ నవ్వుకున్నారు అని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: