ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ టాప్ హీరోలు తీసుకున్న నిర్ణయం జూనియర్ కు కలిసి వచ్చే కాలంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా సంక్రాంతి పండుగకు టాప్ హీరోల సినిమాలు సందడి చేస్తూ ఒక హీరో సినిమా పై మరో హీరో సినిమా పోటీగా విడుదల అవుతూ సంక్రాంతి విజేత ఎవ్వరు అన్న టెన్షన్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. 

అయితే దీనికి భిన్నమైన వాతావరణం రాబోతున్న 2016 సంక్రాంతి రేసుకు కనపడబోతోంది. ఇప్పటి వరకూ రాబోయే సంక్రాంతి నందమూరి హీరోల వార్ గా మారుతుంది అని అందరూ ఊహిస్తూ ఉంటే ఆ ఊహలకు అనుకోని ట్విస్ట్ ఇస్తూ బాలకృష్ణ తన ‘డిక్టేటర్’ ను సంక్రాంతి రేసు నుండి తప్పించి ఫిబ్రవరిలో రాబోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఇదే నిర్ణయాన్ని త్రివిక్రమ్ తన ‘అ ఆ’ సినిమా విషయంలో కూడ తీసుకున్నట్లు గత కొద్దిరోజులుగా మీడియాకు లీక్ లు వస్తున్నాయి. దీనితో సంక్రాంతి రేసుకు ఒక్క జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తప్పించి మరే సినిమా సందడి చేయదు అని అంటున్నారు. అల్లుఅర్జున్ – రామ్ చరణ్ – మహేష్ – రవితేజా లకు సంబంధించిన సినిమాలు ఏవి సంక్రాంతి సమయానికి పూర్తి కాకపోవడంతో అవి రేస్ లో ఖచ్చితంగా ఉండవు. 

ఇలాంటి పరిస్థుతులలో కేవలం జూనియర్ సినిమా ఒక్కటే సంక్రాంతి మార్కెట్ ను దుమ్ము దులిపే అవకాశం కనిపిస్తోంది. మహా అయితే గోపీ చంద్ .. మంచు విష్ణు ... మనోజ్ ... నాని లాంటి చిన్న హీరోల సినిమాలు తప్పించి మరే పెద్ద సినిమా సంక్రాంతి రేసులో ఉండకపోవచ్చు అన్న సంకేతాలు ఫిలింనగర్ లో వినిపిస్తూ ఉండటంతో జూనియర్ మంచి జోష్ లో ఉండటమే కాకుండా తన బాబాయి బాలయ్య తీసుకున్న నిర్ణయానికి హద్దులు లేని ఆనందంలో ఉన్నాడని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: