చిరు 150వ సినిమా అని హడావిడి చేసి దాన్ని కాస్త బ్రూస్ లీలో మూడు నిమిషాల సీన్ అని ఫ్యాన్స్ చల్లపరిచాడు మెగాస్టార్. అయితే ప్రస్తుతం అందరు అనుకున్నట్టుగా 150వ సినిమా అసలు లెక్కకు వస్తే 151వ సినిమా కత్తి రీమేక్ అని అందరికి తెలిసిందే.. అయితే చిరు 12 ఏళ్ల క్రితం మురుగదాస్ తమిళ్ లో చేసిన రమణ సినిమానే తెలుగులో ఠాగూర్ గా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమాకు కూడా వినాయక్ దర్శకుడు.. చిరు భార్య సురేఖ సహ నిర్మాత. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్లో అదే దర్శకుడు రూపొందించిన కత్తి సినిమా రీమేక్లో చిరు నటిస్తుండటం విశేషం.


అంతేకాదు 20 ఏళ్ల కిందట ఫ్లాపులతో సతమతమవుతున్న చిరుకి హిట్లర్ రూపంలో హిట్ వచ్చింది. ఆ సినిమా కూడా ఓ కన్నడ సినిమా రీమేక్ అవ్వడం విశేషం. అప్పటికీ మెగాస్టార్ ఒక రెండేళ్లు సినిమాలు చేయలేదు. గ్యాప్ ఇచ్చి తీసిన హిట్లర్ రికార్డ్ సృష్టించింది. అదే సెంటిమెంట్ తో 7 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ పై మెరవనున్న చిరు మరోసారి తమిళ సూపర్ హిట్ సినిమాతో సినిమా చేయడం.. అది కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.


చిరంజీవి హిట్లర్ పోస్టర్ :


ఇకపోతే రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చిన కత్తి తమిళ నాట సూపర్ హిట్ సినిమాగా నిలిచి దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక చిరు రీ ఎంట్రీకి కూడా ఈ సినిమానే కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.. చరణ్ నిర్మిస్తున్నాడు. 


మరి ఇన్ని అంశాలు కలిసి వచ్చిన కత్తి సినిమా కూడా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించాలని.. మెగాస్టార్ మేనియాలో తెలుగు కత్తి సరికొత్త ట్రెండ్ సృష్టించాలని కోరుకుంటున్నారు మెగా అభిమానులు. మరి త్వరలో ప్రారంభం కానున్న ఆ సినిమా గురించి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: