ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడ చేయని రాజమౌళి దగ్గర ఎందరో టాలెంటెడ్వ్యక్తులు అసిస్టెంట్ అసోసియేటెడ్ డైరెక్టర్స్ పనిచేసారు. అయితే ప్రతిభ ఉన్నా వారిలో ఎవ్వరు దర్శకులుగా రాణించలేదు. కొందరు రాజమౌళి సహాయకులు దర్శకులుగా మారినా వారి మొట్టమొదటి సినిమాలే ఘోరమైన ఫ్లాప్ లుగా మిగిలాయి. దాసరినారాయణరావు దగ్గర శిష్యులుగా పనిచేసిన కోడి రామకృష్ణ లాంటి వాళ్ళు వంద సినిమాలకు దర్శకత్వం వహిస్తే రాజమౌళి దగ్గర పనిచేసిన చాల మంది అసిస్టెంట్స్ కు దర్శకులుగా మారే అవకాశమే రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 


ఒకవేళ అనుకోకుండా అవకాశం వచ్చినా రెండవ సినిమా రావడం లేదు అని టాక్. రాజమౌళి కాంపౌండ్ నుంచి డైరెక్టర్ అయిన మొట్టమొదటి వ్యక్తి కరుణ్ కుమార్ ఇతను నితిన్ తో ‘ద్రోణ’ అనే సినిమా తీశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత మహదేవ్ అతడు కూడ రాజమౌళి శిష్యుడే. బాలకృష్ణతో ‘మిత్రుడు’ సినిమా తీశాడు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడిక రాజమౌళి శిష్యరికం చేసిన మరో వ్యక్తి దర్శకుడవుతున్నాడు. అతడి పేరు జగదీష్ తలసిల.

‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే సినిమాతో దర్శకుడిగా ఈ యువకుడు రంగ ప్రవేశం చేస్తున్నాడు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈసినిమా టీజర్ కూడ అందర్నీ ఆకర్షిస్తోంది. క్రైమ్ కామెడీ తరహాలో ఈసినిమా కథ ఉంటుంది అని అంటున్నారు. 

ఈ నెల 11న ఈసినిమా ఆడియోను రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. రాజమౌళి స్వయంగా ఈసినిమాను ప్రమోట్ చేయబోతున్నట్లు టాక్. ఈసినిమా విజయంతో అయినా రాజమౌళి శిష్యులు వారిని వెంటాడుతున్న ఫ్లాప్ సెంటిమెంట్ నుండి బయట పడతారేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: