మారుతి చిన్న సినిమాల్లో ప్రస్తుతం విప్లవం స్టార్ట్ అయ్యిందంటే అది మారుతి వల్లే అని చెప్పుకోవాలి. ఏమాత్రం టాలెంట్ ఉన్నా సరే గొప్ప పేరు తెచ్చుకోవచ్చని అలాంటి వారికి తానే ఆదర్శం అయ్యేలా చేసుకున్నాడు. అయితే మొన్నటిదాకా తన సినిమాలంటే కాస్త ఎబ్బెటుగా ఫ్యామిలీస్ అందరు చూసే విధంగా ఉండవని అనుకునే వారు. అనుకోవడం కాదు అది నిజం. ఈరోజుల్లో, బస్టాఫ్ సినిమాలు కేవలం యూత్ ఆడియెన్స్ ని బేస్ చేసుకుని చేసిన సినిమాలు. అందుకే మారుతి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ భయపడేవారు.


అయితే మారుతి ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు.. కెరియర్ ప్రారంభించిన నాటి నుండి మారుతి దర్శకత్వం చేసిన సినిమాలన్ని మంచి సక్సెస్ అయ్యి నిర్మాతలకు లాభాలు తీసుకువచ్చాయి. అయితే రీసెంట్ భలే భలే మగాడివోయ్ మాత్రం మారుతి మీద ఉన్న బ్యాడ్ టాక్ అంతా పోయి సక్సెస్ఫుల్ డైరక్టర్ అని ముద్ర పడ్డది. దీన్ని మారుతి కూడా ఒప్పుకుంటున్నాడు. తనపై దర్శక నిర్మాతలు ఉంచిన నమ్మకానికి థాంక్స్ అంటూ ఇప్పుడు తనని పెద్ద హీరోలు కూడా నమ్ముతున్నారని అంటున్నాడు.


కెరియర్ మొదట్లో ఒక ఐడెంటిటీ కోసం తపించి డబుల్ మీనింగ్ డైలాగులతో అడల్ట్ బేస్డ్ సినిమాలు తీసినా ఇప్పుడు తనని తాను మార్చుకుని బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా మారుతిని కలిసి చిట్ చాట్ చేసిన మీడియా ప్రతినిధులు శ్రీమంతుడు దర్శకుడి లానే తనకు కూడా అల్లు అరవింద్ బెంజ్ కార్ ఇచ్చారట కదా అంటే.. అలా ఇస్తే బాగున్ను అని అన్నాడు. అంటే మీడియా డంకా మోగించింది కాని అక్కడ జరిగిందేమీ లేదన్న మాట.


మొత్తానికి మారుతి స్టార్ డైరక్టర్ అవ్వడానికి సమయం దగ్గర పడ్డది. ఓ పెద్ద హీరో సినిమాను కూడా మంచి స్క్రిప్ట్ తో పకడ్బదీగా ప్లాన్ చేసుకుని హిట్ చేస్తే ఇక మారుతి కల గనే బెంజ్ కార్ కూడా గిఫ్ట్ గా పొందే ఛాన్స్ ఉంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: