తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన హీరో ఎవరా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది చిరంజీవి..తెలుగు తెరపై అగ్ర నటుల హవా కొనసాగే సమయంలో విలన్ వేషాలు వేస్తూ..హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడి తెలుగు ప్రేక్షకులకు డ్యాన్స్,ఫైట్స్ లో పూర్తి మార్పులు తీసుకు వచ్చి మాస్ ఫాలోయింగ్ పెంచుకొని మెగాస్టార్ స్థాయికి ఎదిగిన నటుడు చిరంజీవి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసులుగా పవన్ కళ్యాన్, రాంచరణ్,అల్లు అర్జున్ రీసెంట్ గా సాయిధరమ్ తేజ్,వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చారు. ఆ మద్య చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.. ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి హోదాలో పనిచేశారు.  దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి ముఖానికి రంగు వేసుకున్నారు..అంతే కాదు 150 వ చిత్రానికి కూడా రంగం సిద్దం చేసుకుంటున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’చిత్రంలో ఒక పాటపై కొడుకుతో స్టెప్పులు వేశారు ఈ సిన్ ఆ చిత్రాని ఎంతో ప్లస్ పాయింట్ అయ్యింది..కొంత మంది చిరంజీవి అభిమానులు కేవలం ఆ సీన్ కోసమే వెళ్లారంటే ఆ సినిమాకు చిరంజీవి కనిపించడం ఎంత్ ప్లస్ పాయింట్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ‘బ్రూస్ లీ’ చిత్రం వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ చిత్రంలో రాంచరణ్ ఒక ఫైట్ మాస్టర్ గా కనిపించ బోతున్నాడట.. ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ మెగాస్టార్ చిరంజీవి. ‘మగధీర’ చిత్రం తర్వాత తనయునితో నటిస్తున్న తరుణంలో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు పెరిగాయి.. అయితే రాంచరణ్ మాత్రం తండ్రి విషయంలో అన్ హ్యపీగా ఉన్నాడట.

ఈ సంవత్సరం రిలీజ్ అయిన చిత్రాలు ‘టెంపర్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘బాహుబలి’,‘శ్రీమంతుడు’ లాంటి అగ్ర హీరోల చిత్రాలు 50 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు..‘శ్రీమంతుడు’ దాదాపు రెండు వందల క్లబ్ లో పడగా...ప్రపంచ స్థాయిలో రికార్డుల మోత మోగించిన ‘బాహుబలి’ రూ.600 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇక ఆ సినిమాలతో పోల్చితే ‘బ్రూస్ లీ’ బ్లాక్ బ్లస్టర్ హిట్ కావడంమే కాదు కనీసం శ్రీమంతుడు స్థాయికైనా చేరుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయినా..ఆయన నటించిన నిడివి కేవలం మూడు నిమిషాలు.. అంటే ఇలా కనిపించి చూస్తుండగానే వెళ్లిపోతారు.

మగధీర చిత్రంలో చిరంజీవి, రాంచరణ్

Chiranjeevi and Ram Charan

ఇక చిరంజీవి ఎనిమిది సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నాడన ఆనందం ఎంతో టైమ్ ఉండదు అని భావిస్తున్నా అభిమానులు..ఇదే భాద రాంచరణ్ కి కూడా ఉందట..మొదట చిరంజీవి కనీసం పది నిమాషల నిడివితో చేయాలని ప్రయత్నించినా చిరంజీవి అబ్లిగేషన్ పెట్టడంతో మూడు నిమిషాలకు కుదించాల్సిన పరిస్థితి వచ్చిందట.. అంతే కాదు ఈ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించ బోతున్నాడో అన్న ఎగ్జాట్ మెంట్ కూడా రిలీవ్ అయినట్లే.. ఆ మద్య జరిగిన ‘బ్రూస్ లీ ’ ఆడియో ఫంక్షన్లో రాంచరణ్ తో చిరంజీవి డైలాగ్ చెప్పడం.. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రామ్ చరమ్, అల్లు అరవింద్ మద్య వచ్చే హార్స్ రైడింగ్ సీన్ గురించి చెప్పారు.  దాంతో రామ్ చరణ్ హైలెట్ గా ఫీలవుతున్న విషయాలు రివీల్ అవటంతో చిరాకు పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: