తెలుగు చిత్ర సీమలో అప్ కమింగ్ హీరోయిన్లు మంచి జోరుమీదే ఉన్నారు. ముఖ్యంగా రకూల్ ప్రితి సింగ్  ఫుల్ జోష్ లో ఉందట.  ఈ అమ్మడు  పెదాల‌తో త‌న పెదాలు క‌లిపి పెన‌వేసుకుపోయే సీన్లో అద్భుతంగా నటిస్తుందని టాక్.  అందుకే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, రామ్‌ లాంటి యంగ్ హీరోలు తమకు జోడీగా రకూల్ కావాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో రకూల్ కి చేతినిండా సినిమాలే సినిమాలు. వాస్తవానికి రకూల్ మొదట్లో మోడలింగ్ చేసేదట. దీంతో గ్లామర్ పాత్రలకు సరిగ్గా సరిపోతుందని దర్శక, నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు.  

తాజాగా రకూల్ ప్రీితి సింగ్ కి ఓ టెన్షన్ పట్టుకుంది..అది మైనస్ సెంటిమెంట్ కూడా అయ్యింది.. ఈ అమ్మడు లిప్ లాక్ సీన్లో రెచ్చిపోయి మరీ నటిస్తుంది..ఇదే ఈ అమ్మడికి మైనస్ సెంటిమెంట్ అవుతుందిట. గతంలో బాలీవుడ్ లో యారీయన్లో యంగ్ హీరోతో నిమిషానికి పైగా లిప్ లాక్ సీన్లో ఘాటుగా నటించింది అది అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక తెలుగులో సాయికుమార్ తనయుడు ఆది రఫ్ సినిమాలో ఘాటైన  అద‌ర చుంబనం చేసింది అదీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘కిక్2′ లో కూడా లిప్ లాక్ సిన్ ఉంది..ఈ సినిమా కూడా అపజయం పాలైంది.

బ్రూస్ లీ పోస్టర్


వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం, క‌రెంటుతీగ  సినిమాలతో మంచి టాక్ తెచ్చుకున్నా ‘రఫ్’ , ‘కిక్ 2‘ సినిమాతో ఢీలా పడిపోయింది.. తన నటించిన హీరోల అందరితో లిప్ లాక్ సీన్ లో రెచ్చిపోయిమరీ చేసింది. ఇప్పుడు ఈ అమ్మడికి కొత్త టెన్షన్ పట్టుకుందట..శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్, రకూల్ ప్రితి సింగ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ ’ చిత్రంలో కూడా ఘాటైన లిప్ లాక్ సీన్ ఉందట..మరి గతంలో మాదిరిగా బ్యాడ్ సెంటిమెంట్ ఫాలో అవుతుందా.. లేదా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తే బ్రూస్‌లీ హిట్‌ అవుతుందా ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే రకూల్ కి బ్యాడ్ సెంటిమెంట్ పోయినట్లే అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: