బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన దర్శక దిగ్గజుడు ఎస్.ఎస్.రాజమౌలికి లవ్ స్టోరీలు తీస్తూ కాలం గడుపుతున్న తేజ కామెంట్స్ ఘోర అవమానం కలిగించేలా ఉన్నాయ్. రీసెంట్ గా హోరా హోరీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కాస్త డిస్ట్రబ్ అయిన తేజ ఏం మాట్లాడుతున్నాడే అతనికే తెలియని విధంగా ఉన్నాడు. అప్పట్లో సినిమా ప్రమోషన్ కోసం స్టార్ హీరోల సినిమాల మీద పడి ఏడ్చిన తేజ. ప్రస్తుతం సినిమా లేకున్నా సరే హాట్ కామెంట్స్ చేయడం మాత్రం మానడం లేదు.


తన సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో రివ్యూ చూసుకోవాల్సిన అవసరం తనకి లేదని దురుసుగా ప్రవర్తిస్తున్న తేజ. తెలుగు సిని చరిత్రలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన బాహుబలి సినిమా చూడలేదని హాట్ కామెంట్ చేశాడు. బాహుబలి సినిమా తేజ చూడటం చూడకపోవడం పెద్ద విషయం కాకపోయినా అంత పెద్ద సూపర్ హిట్ అయ్యి.. బాలీవుడ్ హీరోలకు కూడా చెమటలు పట్టేలా చేసిన రాజమౌలికి తేజ అవమానం చేసినట్టే భావిస్తున్నారు కొందరు ఈ మాటలు విని.


అయినా తీసిన సినిమాలే తీసి లవ్ స్టోరీలంటేనే విరక్తి కలిగేలా చేసే తేజ, బాహుబలి లాంటి అద్భుత కళాఖండాన్ని మెచ్చుకుంటే ఎంత మెచ్చుకుపోతే ఎంతా అని అనేవాళ్లు ఉన్నారు. ఇక ఇదే అధునుగా మహేష్ తో కాకుండా నిజం సినిమా ఏ ఉదయ్ కిరణ్ తోనో, నితిన్ తోనో తీసుంటే బాగా ఆడేదని.. ఇక తన సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ అసలు పనికిరాడని అంటున్నాడు. చూస్తుంటే వర్మ లానే ఏదో ఒక విషయం మీద దుమారం లేపకపోతే తేజకి కూడా నిద్ర పట్టేట్టు లేదు.


ప్రస్తుతం సినిమా ఎలాగూ ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఇలాంటి కబుర్లు చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండాలని భావిస్తున్నాడు. అయినా వర్మ మాటలే పట్టించుకోని ప్రేక్షకులు.. తేజ మాటలను ఎలా వింటారు చెప్పండి.


మరింత సమాచారం తెలుసుకోండి: