ప్రస్తుతం బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారిన చిత్రం “ప్రేమ్ రతన్ థన్ పాయో”. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటిస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ ట్రైలర్ నేటితో 10 రోజుల పూర్తి చేసుకుంది.


అయితే రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనూ “ప్రేమ్ రతన్ థన్ పాయో” థియోట్రికల్ ట్రైలర్ కి అధిరే రెస్పాన్స్ వచ్చింది. అంతటితో ఆగకుండా రోజ రోజుకి థియోట్రికల్ ట్రైలర్ కి వస్తున్న రెస్పాస్ ని చూసి, బిటౌన్ బడా స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు. “ప్రేమ్ రతన్ థన్ పాయో” థియోట్రికల్ ట్రైలర్ 9 రోజులకి గానూ యూట్యూబ్ లో కోటి మంది నెటిజెన్స్ వీక్షించారు.


బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ వచ్చిన ఏ స్టార్ హీరో థియోట్రికల్ ట్రైలర్ కి ఈ రకమైన రెస్పాన్స్ లేదు. కేవలం సల్మాన్ ఖాన్ చిత్రానికి మాత్రమే ఈ రకమైన ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల థియోట్రికల్ ట్రైలర్స్ కి యూట్యూబ్ లో భారీ స్పంధనే ఉండేది.


మొత్తానికి “ప్రేమ్ రతన్ థన్ పాయో” మూవీని థియోటర్స్ లో చూడటానికి అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారో దీన్నీ బట్టే తెలుస్తుంది. యూట్యూబ్ లోవస్తున్న రెస్పాన్స్ ని చూసి ఈ మూవీని భారీగా థియోటర్స్ లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: