టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం థియోటవర్స్ వద్ద హంగామా క్రియేట్ చేయబోతున్న ఫిల్మ్ రుద్రమదేవి. గుణశేఖర్ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. గతంలో రుద్రమదేవి రిలీజ్ కోసం సకల కష్టాలు కలిసొచ్చి, చిత్ర విడుదలకి అడ్డంకులుగా మారాయి. ప్రస్తుతం రుద్రమదేవి రిలీజ్ జెడ్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది.


రుద్రమదేవి రిలీజ్ కి ప్రమోషన్ చేయటం కోసం స్టార్ యాక్టర్స్ సైతం ఆసక్తి చూపటంతో ఈ మూవీపై మార్కెట్ లో భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే, అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకులతో పాటు మలయాళ, హిందీ వెర్ష్ లోనూ రుద్రమదేవి మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో అనుష్క రుద్రమదేవిగా, అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా, రానా చాళుక్య వీరభద్రుడుగా కనిపించనున్నారు.


వీరు కాకుండా ఇతర స్టార్ కాస్టింగ్ కూడ మూవీకి బలం చేకూర్చింది. ఇక తాజాగా రుద్రమదేవి ప్రి బుకింగ్స్ ని ఓపెనింగ్ చేశారు. అలా బుకింగ్ ప్రారంభించిన అన్ని సెంటర్స్ లో అప్పుడే మొదటి రోజు టికెట్స్ అమ్ముడుపోయాయంట. ఇక మల్టీప్లెక్స్ లోనూ అదే హావా కొనసాగుంతుంది.


త్రిడి మూవీకి సంబంధించిన మొదటి 2 రోజులు, మల్టీప్లెక్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూస్తే, రుద్రమదేవికి మొదటి రోజు ఓపెనింగ్స్ అధిరేలా ఉంటాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కృష్ణం రాజు, నిత్యా మీనన్, కేథరిన్, హంసా నందిని, సుమన్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: