పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ “సర్ధార్ గబ్బర్ సింగ్”. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా “సర్ధార్ గబ్బర్ సింగ్” మూవీ, ఐటెం సాంగ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ పాటని నానక్రామ్ గూడా రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో షూట్ చేశారు.


ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ నటించిన ఐటెం సాంగ్స్ షూటింగ్ కేవలం 3 రోజుల సమయం కంటే ఎక్కువ పట్టలేదు. గతంలో గబ్బర్ సింగ్ మూవీలోని కెవ్వుకేక ఐటెం సాంగ్ షూటింగ్ ని సైతం 3 రోజుల్లో పూర్తి చేశారు. కానీ, “సర్ధార్ గబ్బర్ సింగ్” మూవీలోని ఐటెం సాంగ్ చిత్రీకరణకు దాదాపు 9 రోజులు పట్టింది.


పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ స్టెప్పులేసింది. లక్ష్మీరాయ్ తో 9 రోజులు డేట్స్ తీసుకున్న చిత్రయూనిట్, ఓ సాంగ్ ని ఇన్ని రోజులు చిత్రీకరణ చేశారా? అంటూ డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం ఐటెం సాంగ్ లకి ఎక్కువ రోజులు టైం వేస్ట్ చేయడు. కానీ ఈసారి 9 రోజుల కాల్షీట్స్ ని ఈ సినిమా ఐటెం సాంగ్ కోసం కేటాయించాడంటే ఏదో సంధింగ్ సంథింగ్ అంటున్నారు.


ఇక దేవిశ్రీ కంపోజ్ చేసిన “సర్ధార్ గబ్బర్ సింగ్” ఐటెం సాంగ్, సూపర్భ్ అవుట్ పుట్ తో అధరగొట్టిందంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కెర్లు కొడుతుంది. త్వరలోనే ఈ సాంగ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరగబోతుంది. ఇక “సర్ధార్ గబ్బర్ సింగ్” మూవీలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం రెండు రోజులు రెస్ట్ తీసుకున్న ఈ చిత్ర యూనట్ తరువాత “సర్ధార్ గబ్బర్ సింగ్”క్లైమాక్స్ చిత్రీకరణ షెడ్యూల్ లో పాల్గొననుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: