తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చారిత్రాత్మక చిత్రాలు వచ్చినప్పటికీ కాకీయుల చరిత్రపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన చిత్రం ‘రుద్రమదేవి’. రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు ఈమె చరిత్రను నిశితంగా పరిశోదించి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అనుష్క ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు దర్శక, నిర్మాత గుణశేఖర్. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా రేపు  విడుదలకు సిద్దమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో థియేటర్లోకి రావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పదే పదే పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు 5 భారతీయ భాషల్లో విడుదల చేస్తామన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే...ఈ చిత్రం ఓ ఎపిక్‌ డ్రామా. 13 వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కథను ఏమాత్రం వక్రీకరించకుండా తెరకెక్కించామన్నారు. రుద్రమదేవి చరిత్ర గురించి ఎన్నోపుస్తకాలు చదివాను. అంతేకాకుండా రీసెర్చ్‌ టీంను కూడ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ముఖ్యంగా ముదిగొండప్రసాద్‌ ఎంతగానో సహకరించారు.

రుద్రమదేవి కాకతీయుల ప్రజలకోసం చేసిన త్యాగాలను , 40 ఏళ్లపాటు ఆరోజుల్లో ఓస్త్రీ అయిన ఆమె పరిపాలించిన విధానాన్ని ఈ సినిమాలో చూపించామన్నారు. తాజాగా రుద్రమ దేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి దర్శకుడు గుణశేఖర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి విజ్ఞప్తి చేశాడు.  ఈ సందర్భంగా రుద్రమ దేవి చిత్రాన్ని చూడాల్సిందిగా కెసిఆర్ ను గుణశేఖర్ కోరారు.  


రుద్రమదేవి చిత్ర నటులతో దర్శకుడు గుణశేఖర్

article data
తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరనారి కాకతి రుద్రమ కథను భారీ ఎత్తున వెండితెరకు ఎక్కిస్తున్నందున ట్యాక్స్ మినహాయింపు కావాలని దర్శకుడు ముఖ్యమంత్రిని అభ్యర్ధించగా, అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలని కోరారు. ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: