హైదరాబాద్ లో పుట్టి పెరిగి తెలుగు ఇండస్ట్రీలో కాకుండా తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో పేరు తెచ్చకున్న హీరో అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీకి చెందిన శాలిని వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యాడు. అజిత్ చాలా క్యాజువల్ గా ఉండే నటుడు..అభిమానులు ముద్దుగా ‘తల’ అని పిలుచుకునే అజిత్. తాజాగా  అజిత్ కొత్త సినిమాకు వేదలమ్ అని పేరు పెట్టారీ సినిమాకు. అంటే బేతాళం.. దయ్యం.. అని అర్థమన్నమాట. వాస్తవానికి  వినాయక చవితి రోజు ఫస్ట్ లుక్ అంటూ ఊరించి.. వారం లేటుగా నిన్నటి అర్ధరాత్రి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.

రెడ్ కలర్ కుర్తా.. తనదైన శైలిలో తెల్ల జుట్టు.. అది కూడా చాలా షార్ట్‌గా.. మెడలో చైను.. చేతిలో కళ్లజోడు.. మొత్తం అజిత్ వ్యవహారమంతా చాలా డిఫరెంటుగా ఉంది. ఇంతకుముందు ‘రెడ్’ అనే సినిమాలో దీనికి దగ్గరగా ఉండే లుక్ లో కనిపించాడు అజిత్.  'వేదలమ్' సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. సోషల్ నెట్ వర్క్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.. కోలీవుడ్ లో పెద్ద పండుగ దీపావళికి వేదలమ్ ను రిలీజ్ చేయనున్నారు. అజిత్ మూవీకి వేదలం టైటిల్ పై ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వారం అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నా.. చివరకు పవర్ ఫుల్ గా ఉంటుందని వేదలమ్ కే మొగ్గు చూపారు. 


‘వేదలమ్’ ఫస్ట్ లుక్ లో అజిత్


తమిళ స్టార్ హీరో థలా అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వేదలమ్’. ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిరాం క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. ఐశ్వర్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ చాలా స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ గా రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: