అందరి ఊహాలను తారుమారు చేస్తూ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ‘రుద్రమదేవి’ ఫస్ట్ డే – ఫస్ట్ షో టాక్ రాకుండానే రామ్ చరణ్ కు ఒక విషయంలో టెన్షన్ పెడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘రుద్రమదేవి’ ఏ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగోడుతుంది అన్న విషయమై క్లారిటీ ఇంకా రాకపోయినా ‘రుద్రమదేవి’ మాత్రం రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ఒక రికార్డును బ్రేక్ చేయడం ఖాయం అనే మాటలు టాలీవుడ్ విశ్లేషకులు చెపుతున్నారు. 

ఈరోజు అత్యధిక ధియేటర్లలో ‘రుద్రమదేవి’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈసినిమా మొదటి రోజు కలెక్షన్స్ సుమారు 12 నుండి 14 కోట్ల మధ్య ఉండవచ్చు అని అంటున్నారు. ‘రుద్రమదేవి’ సినిమాకు టాక్ ఎలా వచ్చినా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి మొదటిరోజు కలెక్షన్స్ రికార్డ్ అనుష్క బ్రేక్ చేస్తుంది అనుకోవాలి.

రామ్ చరణ్ సినిమాలలో ‘ఎవడు’ సినిమాకు వచ్చిన మొట్టమొదతిరోజు ఓపెనింగ్స్ 8.6 కోట్లు రామ్ చరణ్ కెరియర్ కు సంబంధించి అత్యధిక మొదటిరోజు కలెక్షన్స్ రికార్డుగా చెపుతారు. అయితే ఈ రికార్డును ఇప్పటికే అనేకమంది టాప్ హీరోల సినిమాలు బ్రేక్ చేసినా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చరణ్ రికార్డులను బ్రేక్ చేయబోతోంది అని వార్తలు రావడం రామ్ చరణ్ కు షాకింగ్ న్యూస్ మారినట్లు టాక్. 

70 కోట్ల బడ్జెట్ తో గుణశేఖర్ అనుష్కను నమ్ముకుని చేసిన సాహసం పై ప్రేక్షకుల తుది తీర్పు మరి కొద్ది గంటలలో బయటకు వచ్చేస్తుంది. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈసినిమా బిజినెస్ సుమారు 50 కోట్ల వరకు జరిగింది అని అంటున్నారు. దాదాపు 20 నుండి 25 కోట్లు లోటుతో ఈరోజు విడుదల అవుతున్న ఈసినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే కాని గుణశేఖర్ కష్టాలు గట్టేక్కవు. అయితే ఈసినిమాకు సంబంధించిన తెలుగు, హిందీ, తమిళ ఛానల్స్ శాటిలైట్ రైట్స్ ఎవ్వరికీ ఇంకా గుణశేఖర్ ఇవ్వని నేపధ్యంలో ‘రుద్రమదేవి’ కి సూపర్ హాట్ టాక్ వస్తే గుణశేఖర్ కష్టాల నుండి గట్టెక్కడం ఖాయం అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: