తమిళంలో జయం రవి హీరోగా జయం రాజా దర్శకత్వంలో రూపొందిన తని ఒరువన్‌ చిత్రం అక్కడ సంచలన విజయం సాధంచింది. కాగా ఇందులో  విలన్‌గా నటించిన అరవింద్‌ స్వామికి ఎంతో మంచి పేరు వచ్చింది. త్వరలో ఈ చిత్రం రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.ఇక  యంగ్ హీరో వెంకటేష్ వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన రానా కూడా హీరోగా నటించి ‘బాహుబలి’ చిత్రంలో విలన్ అవతారం ఎత్తాడు..అయితే ఈ సినిమాతో ఎక్కడ లేని ఇమేజ్ సోంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం హీరోలకు తమకు జోడీగా ఉన్న వారినే విలన్లుగా ఎంచుకుంటున్నారు. ఈ సినిమాకు మొదట అరవింద్ స్వామి స్థానంలో రానాను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రను రానా చేత కాకుండా హీరో నాగార్జున చేత చేయించాలని ఈ చిత్రం యూనిట్‌ భావించారు. ఇది కూడా నాగ్ ఇమేజ్ కి సరిపోదని సోనూ సూద్ ని అనుకున్నప్పటికీ కూదరలేదు..  తాజాగా తెరపైకి  ఒకప్పుడు తమిళ హీరోగా వచ్చిన రన్, సఖి, చెలి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం తర్వాత మళ్లీ మాధవ్ తెలుగు తెరపై, అందులోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రలో, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి

హీరో రాంచరణ్


మాధవన్ గతలో కూడా ‘యువ’ చిత్రంలో విలన్ గా నటించాడు.  ఈ నేపథ్యంలోనే మాధవన్‌ను తెలుగు రీమేక్‌కు సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళంలో అరవింద్ స్వామి చేసిన పాత్రకు తెలుగులో మాధవన్‌ను సంప్రదిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించబోతున్నట్లు సమాచారం. ‘థాని ఓరువన్' చిత్రం రీమేక్ రైట్స్ భారీగా ధరకు కొనుగోలు చేసారు. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించ బోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: