బ్రూస్ లీ’ సినిమా ఈనెల 16న విడుదల కాబోతున్న నేపధ్యంలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి 8.59 సీక్రెట్ తనను ఎలా ప్రభావితం చేసిందో, అన్న విషయానికి సంబంధించి ఒక ఆశక్తికర విషయాన్ని బయట పెట్టింది. ‘బ్రూస్ లీ’ సినిమాలో తాను చిరంజీవితో కలిసి నటించిన సన్నివేశాలను గుర్తుకు చేసుకుంటూ అటువంటి అదృష్టం తనకు కలిగినందుకు తాను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాని నిజంగా అదినిజమా లేక కలా అన్న సందేహం తనను ఇప్పటికీ వెంటాడుతోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్. 

కోట్లాదిమంది అభిమానులు పొందిన మెగా స్టార్ చిరంజీవిని ‘బ్రూస్ లీ’ షూటింగ్ స్పాట్ లో చూడగానే కొద్ది క్షణాలు తన మైండ్ బ్లాంక్ అయింది అని అంటూ చిరంజీవి షూటింగ్ స్పాట్ కు ఎంటర్ అయినప్పుడు జరిగిన సంఘటనను గుర్తుకు చేసుకుంది. దర్శకుడు శ్రీనువైట్ల చిరంజీవితో షూటింగ్ చేయడానికి ఉదయం 9 గంటలకు షూటింగ్ స్పాట్ లో ఉంటే సరిపోతుంది అని చెపితే చిరంజీవి షూటింగ్ స్పాట్ కు ఖచ్చితంగా ప్రతిరోజు 8.59 నిముషాలకు షూటింగ్ స్పాట్ లో ఉండి తనకూ ‘బ్రూస్ లీ’ యూనిట్ కు షాక్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను జీవితంలో ఎదగాలి అంటే ఎన్ని విషయాలు చిరంజీవి గారి నుండి నేర్చుకోవాలో అర్ధం అయ్యేడట్లుగా చిరంజీవి క్రమశిక్షణ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని మెగా స్టార్ ను ఆకాశానికి ఎత్తేసింది రకుల్ ప్రీత్.

ఇటువంటి టాప్ పొజిషన్ లో ఉండి కూడా చిరంజీవి తనను చూసి ‘రకుల్ నీవు గ్లామర్ తో మెరిసి పోతున్నావు’ అంటూ అందరి ఎదుట తనను ప్రశంసించిన ప్రశంసలు తాను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ చిరంజీవి తనకు నటనకు సంబంధించి ఎటువంటి సలహాలు ఇవ్వకపోయినా ఆయన నుండి తాను ఎన్నో నేర్చుకున్నాను అంటూ మెగా భజన చేసింది రకుల్. 

సినిమా పట్ల చిరంజీవికి ఉండే ప్రేమ ఆయన ఏకాగ్రత తోటి కళాకారుల పట్ల చిరంజీవి చూపే గౌరవం తాను ఇప్పటి వరకు ఎవరిలోనూ చూడలేదు అంటూ చిరంజీవి తనను ఎంత ప్రభావితం చేసారో అన్న విషయాన్ని మురిసి పోతూ వివరించిన రకుల్ ప్రీత్ మాటలు వింటే మెగా కుటుంబాన్ని రకుల్ గట్టిగానే బుట్టలో పెట్టినట్లు అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: