అఖిల్ నటించిన మొట్టమొదటి సినిమా విడుదల కాకుండానే అతడి రెండవ సినిమాకు సంబంధించి  వస్తున్న వార్తలు అందరికి షాక్ ఇస్తున్నాయి. అఖిల్ తో సినిమా చేయడానికి దర్శకుడు పూరిజగాన్నాథ్ చేసిన ప్రయత్నానికి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయని టాక్. పూరి అఖిల్ ను కలిసి ఒక స్టొరీ లైన్ చెప్పడానికి ఎంత ప్రయత్నించినా అఖిల్ ఆశక్తి చూపించడం లేదు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. 

అంతేకాదు అఖిల్ ఇలా ప్రవర్తిచడం వెనుక నితిన్ హస్తం ఉంది అనే ప్రచారం కూడ జరుగుతోంది. ఈ వార్తలు ఇలా ఉండగా కొరటాల శివ అఖిల్ సినిమాకు సంబంధించి మైత్రీ మూవీస్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కోనసాగుతునే ఉన్నాయని టాక్. ఈసినిమాలో నటించడానికి అఖిల్ అంగీకరిస్తే 12 కోట్ల భారీ పారితోషికం అఖిల్ మైత్రి మూవీస్ నిర్మాతలు ఆఫర్ చేనట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా అఖిల్ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వినాయక్  గత వారంరోజులుగా చెన్నైలో మకాంవేసి పనులు చేయిస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఎడిటింగ్ రూమ్ నుంచి కొన్ని విషయాలు బయటికొచ్చాయి. ఈసినిమాలో అఖిల్ డ్యాన్స్ దుమ్ము రేగిపోయిందట. ‘హే అఖిల్’ అని సాగే ఇంట్రడక్షన్ సాంగ్ లోనైతే అఖిల్ స్టెప్పులు కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయని అంటున్నారు. 

ఆ పాటని మూడు భారీ సెట్లలో షూట్ చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈసాంగ్ ని కంపోజ్ చేసిన ఈపాటను  చూసిన వారికి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ స్థాయి మించి అఖిల్ స్టెప్స్ ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా అఖిల్ కనీసం పూరి చెప్పడానికి ప్రయత్నిస్తున్న కథను వినకపోవడం అనే న్యూస్ నేటి హాట్ టాపిక్..


మరింత సమాచారం తెలుసుకోండి: