ఒక హీరో వదులుకున్న సినిమా మరో హీరోకి హిట్ గా మారిన సందర్భాలు చూశాం. కాని ఒక హీరో వదులుకున్న సినిమా మరో హీరోకు ఘోరమైన ఫ్లాప్ గా మిగిలిన సందర్భాలు చాల అరుదుగా జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భమే ‘శివమ్’ సినిమా విషయంలో జరిగింది.

‘శివమ్’ సినిమాలో హీరోగా నితిన్ నటించవలసి ఉంది. కొత్త దర్శకుడు శ్రీనివాసరెడ్డి చెప్పిన ఈకథకు మొదట నితిన్ పచ్చ జెండా ఉపాడు. అయితే శ్రీనివాసరెడ్డి చెప్పిన కథలో నితిన్ మార్పులు చెప్పడంతో ఆ మార్పులు నచ్చక దర్శకుడు శ్రీనివాసరెడ్డి రామ్ చెంతకు చేరాడట. అయితే అక్కడ కూడ శ్రీనివాసరెడ్డికి దురదృస్టమే వెంటాడింది. 

పేరుకు మాత్రమే ‘శివమ్’ సినిమాకు దర్శకుడుగా శ్రీనివాసరెడ్డిని ఉంచి రామ్ అన్ని విషయాలు తానే నడిపించుకుని ఒక సినిమాను ఎంత భయంకరంగా తీయ వచ్చో ‘శివమ్’ ద్వారా నిరూపించాడు. ఈసినిమాకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ వద్ద జరిగిన మ్యూజిక్ సిటింగ్స్ వద్ద కూడ శ్రీనివాసరెడ్డి ప్రమేయం లేకుండా రామ్ ‘శివమ్’ వ్యవహారాలు నడిపించాడు అని టాక్. దీనితో నితిన్ వద్ద ఏ టార్చర్ తప్పించుకోవాలని దర్శకుడు శ్రీనివాసరెడ్డి ప్రయత్నించాడో దానికి రెట్టింపు టార్చర్ ఈ నూతన దర్శకుడు రామ్ వద్ద పొందాడు అని టాక్. 

దీనితో తన మొట్టమొదటి సినిమా రామ్ తో చేసి చాల పొరపాటు చేసాను అని శ్రీనివాస రెడ్డి తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటికే పరాజయాల బాటలో పయనిస్తున్న నితిన్ తాను ‘శివమ్’ ప్రయోగం నుండి తప్పించుకుని చాల మంచి పని చేసాను అని ఆనంద పడుతున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: