భారతదేశంలో మొట్టమొదటి  స్టీరియో స్కోపిప్ 3డి పీరియాడిక్ ఫిల్మ్ “రుద్రమదేవి” గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. గతంలో “రుద్రమదేవి” కి పబ్లిసిటి కరవైతుందనుకుంటే, అనూహ్యంగా అందరూ ఈ మూవీ రిలీజ్ విషయంలో గుణశేఖర్ కి తోడుగా నిలిచారు.


ప్రతిఒక్క స్టార్ “రుద్రమదేవి”మూవీ రిలీజ్ కోసం పబ్లిసిటిని చేశారు. ఇక రిలజ్ కి ముందు రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్...వినోపదన్నుని మినహాయించటంతో ఈ మూవీ ఇండస్ట్రీ టాక్ గా మారింది. మొత్తంగా “రుద్రమదేవి” నేడు థియోటర్స్ వద్ద హడావిడి చేస్తుంది. సామన్య ప్రేక్షకుడు సైతం “రుద్రమదేవి” మూవీని చూడటానికి ఆసక్తి చూపుతున్నాడు. 


“రుద్రమదేవి” మూవీలో ఏది బాగుంది? ఏది బాగోలేదు? వంటి వంటి వివరాలను తెలుసుకోవటం అనవసరం. ఎందుకంటే ఈ మూవీ ఓ హిస్టారికల్ స్టోరితో వచ్చింది. అందరికి తెలిసిన హిస్టరీని, దర్శకుడు విజువల్ పరంగా ఏ విధంగా చూపించాడు అనేదే కీలకం. అందుకే ప్రేక్షకులు మూవీ హిట్టా?ప్లాపా? అనేది వదిలేసి....నచ్ఛిందా? లేదా? అంటూ అడుగుతున్నారు. ఇక పుస్తకాల్లో ఉన్న స్టోరీని విజువల్ గా చూసిన ప్రేక్షకులు థ్రిల్ గా ఫీల్ అవుతున్నారు.


ఓ రకంగా చెప్పాలంటే ప్రేక్షకుడు హ్యాపీనే. ఈ రకంగా “రుద్రమదేవి” దేవీ మూవీ సక్సెస్ ని సాధించిందనే చెప్పవచ్చు. మూవీలో కొద్దిపాటి కథకి సంబంధించిన డౌట్స్, అలాగే కొన్ని క్యారెక్టర్స్ కి సంబంధించిన వివరాలు సందేహంగా ఉన్నప్పటికీ, తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ పాయిట్ ని దర్శకుడు చక్కగానే చూపించాడు. మొత్తానికి థియోటర్స్ వద్ద ఉన్న ప్రేక్షకులు రుద్రమదేవి మూవీ నచ్చిందనే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: