‘రుద్రమదేవి’ బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు పూర్తి కావడంతో ఆ సినిమా పై ప్రేక్షకులు ఇస్తున్న పాజిటివ్ టాక్ గుణశేఖర్ ను జోష్ లో ముంచెత్తి వేస్తోంది. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘రుద్రమదేవి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నట్లుగా ఇరు రాష్ట్రాల నుండి వార్తలు వస్తున్నాయి. రాణి రుద్రమగా అనుష్క చూపించిన రాజసం ఆమె దీరోదాత్తమైన నటన ‘రుద్రమదేవి’ విజయంలో కీలక పాత్రను పోషించినా ఈసినిమాలో కనిపిస్తున్న మెగా ఫ్యామిలీ హంగామాతో మెగా అభిమానులకు ‘రుద్రమదేవి’ మెగా విందుగా మారిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి.

గోన గన్నారెడ్డిగా నటించిన అల్లుఅర్జున్ కు సంబంధించిన క్లైమాక్స్ ట్విస్ట్ ఈసినిమాకు ప్రాణం పోసింది అన్న వార్తలు వస్తున్నాయి. బన్నీ ఇప్పటి వరకు చేసిన పాత్రలు ఒక ఎత్తు గోన గన్నారెడ్డిగా నటించిన ఈ పాత్ర మరొక ఎత్తుగా మారి అల్లుఅర్జున్ క్రేజ్ ను మరింత పెంచుతుంది అని అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో పాటుగా అక్టోబర్ 16న విడుదల కాబోతున్న ‘బ్రూస్ లీ’ ట్రైలర్ ఈ సినిమాలో కనిపించడం మెగా అభిమానులకు మరింత జోష్ ను ఇస్తోంది. 

ఈసినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ బట్టి ఈవారం అంతా ‘రుద్రమదేవి’ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది అని అంటున్నారు. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి భారీ సినిమాలు వరసగా విజయం సాధించడంతో టాలీవుడ్ సినిమా నిర్మాణంలో భవిష్యత్ లో చాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చరిత్రకు సంబంధించిన సినిమాలను కూడ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల కథల ఎంపిక పై ‘రుద్రమదేవి’ విజయం ప్రభావం చూపెట్టే అవకశం ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ తన 100వ సినిమాగా తీయాలని భావిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’ విజయంతో తిరిగి పట్టాలు ఎక్కినా ఆశ్చర్యం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: