ఎన్నో భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అయిన రుద్రమదేవి సినిమాలో అందరి అంచనాలను అందుకుంటూనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రతి సన్నివేశంలో దర్శక నిర్మాత గుణశేఖర్ కష్టం కనపడుతుంది. ఇక మెయిన్ లీడ్ అయిన అనుష్క అయితే సూపర్బ్ గా చేసిందట. అసలు ఇలాంటి సినిమాలంటే అనుష్క యాక్టింగ్ అదిరిపోద్దని తెలుసు కాని.. ప్రత్యేకంగా రుద్రమదేవిగా అనుష్క అదరగొట్టిందట. ఇక గోనా గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అయితే అరుపులు పుట్టించాడట.


అర్ధగంట క్యారక్టరే అయినా సరే బన్నీ తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడని అంటున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ అన్నది పక్కన పెడితే సినిమాలో అందరు తమ తమ పాత్రల మేరకు అద్భ్హుతమైన నటనను కనబరచారు. అయితే ఆడియెన్స్ మాత్రం ఒక్క రానా విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. బాహుబలిలో భాళ్లాలదేవ అంత మంచి అభినయం కనబర్చిన రానా ఈ సినిమాలో కూడా అదే రేంజ్ పాత్రలో అలరిస్తాడని ఊహించారు. కాని సినిమాలో మాత్రం రానా అంతగా ఆకట్టుకోలేకపోయాడట.


రుద్రమదేవి పోస్టర్ :


రానా గురించే ఈ సినిమాకి వెళ్లీ ఆడియెన్స్ కి సినిమా నిరుత్సాహం కలిగిస్తుందట. ఇక బన్నీ గురించి మాత్రం మెగా ఫ్యాన్స్ అందరు దసరా ఒక పది రోజులు ముందు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి 8 ఏళ్ల గుణశేఖర్ కల ఇలా కార్యరూపం దాల్చి సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తుంది. మొదటి షో నుండి హిట్ టాక్ రెచ్చుకున్న రుద్రమదేవి కలెక్షన్ పరంగా కూడా భారీగా మోత మోగించడం ఖాయమని అంటున్నారు.


అనుష్క, బన్నీ క్యారక్టర్స్ హైలెట్ గా నిలిచిన రుద్రమదేవి సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ప్రకాశ్ రాజ్, కృష్ణం రాజు కూడా తమ క్యారక్టర్ల పరిధి మేరకు అదరగొట్టారట. ఇక సినిమా రిజల్ట్ చూసి గుణశేఖర్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: