సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం మూవీ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ప్రిన్స్ మహేష్ ఈ సినిమా తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా ఓకే చేస్తాడా అని కాస్త కన్ ఫ్యూజన్ ఉంది. కాని తెలుస్తున్న కథనాల ప్రకారం మహేష్ తన తర్వాత సినిమాను మురుగదాస్ తోనే చేస్తున్నాడనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా బడ్జెట్ కూడా దాదాపు 80 కోట్లు ఉంటుందని అంచనా.. మొన్నటిదాకా 100 కోట్ల కలెక్షన్ అంటే అదో అందని ద్రాక్ష అనేలా ఉన్న తెలుగు సినిమా స్టామినా ఇప్పుడు ఏకంగా దాన్ని అవలీలగా క్రాస్ చేసే మార్కెట్ ట్రిక్ కనిపెట్టింది.


ఇక అందుకే దర్శక నిర్మాతలు కూడా స్టార్ హీరోల సినిమాలంటే ఎంత బడ్జెట్ అయినా ఓకే అనేస్తున్నారు. అయితే మహేష్ సినిమా శ్రీమంతుడు లాంగ్ రన్లో గ్రాస్ 150 ప్లస్ క్రోస్ కలెక్ట్ చేయగా దాని షేర్ మాత్రం 85 కోర్స్ దాకా వచ్చిందని ట్రేడ్ టాక్. అయితే మరి మహేష్ బ్లాక్ బస్టర్ సినిమానే 85 కోట్లు దాటకపోతే మరి బడ్జెట్టే 80 కోట్లంటే ఇక సినిమా ఓ రేంజ్లో కలెక్ట్ చేయాలి.


ఇదే గాక మహేష్ తో సినిమా తీయడానికి పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, విక్రం కుమార్ లు కూడా క్యూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరేవారిని కాదని మహేష్ మురుగదాస్ కి ఒటెయ్యడం అంటే కథలో మాంచి పట్టు ఉండుంటుంది. సూర్య గజినితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా దాస్ తెలుగులో మెగాస్టార్ తో స్టాలిన్ సినిమా తీసాడు.


అయితే స్టార్ హీరోలు సరైన హిట్ కొడితే కోట్లొచ్చి పడతాయి కాని బడ్జెట్ 80 కోట్లయితే ఇక రాబడి ఎంత ఉండాలన్నది ప్రశ్న అవుతుంది. మరి మురుగదాస్ అంటే ఏదో ఒక మ్యాజిక్ లేనిదే సినిమా ఉండదు. మరి ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఈ క్రేజీ కాంబో కలిసి చేస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: