మెగా డాటర్ నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఖాయం కావడంతో ఆమె సినిమా లాంచింగ్ ఫంక్షన్ కు సంబంధించి వార్తల హడావిడి మొదలైంది. క్రియేటివ్ దర్శకుడుగా పేరుగాంచిన రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ 30వ తారీఖున మొదలు కాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘ఒక మనసు’ అనే టైటిల్ తో నిర్మిoప బడుతున్న ఈసినిమా ప్రారంభాన్ని చాల ఘనంగా చేయాలని నాగబాబు ఆలోచిస్తున్నట్లు టాక్. 

మెగా కుటుంబ హీరోలు అంతా ఈ ఫంక్షన్ లో పాల్గొనే విధంగా నాగబాబు అప్పుడే తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగా హీరోలందరిని రప్పించడం ఒక సమస్య అయితే పవన్ కళ్యాణ్ ను రప్పించడం నాగబాబుకు పెను సమస్యగా మారింది అని టాక్. అయితే నిహారిక అంటే ప్రత్యేకమైన అభిమానం పవన్ కు ఉండటంతో నిహారిక కోసం అయినా పవన్ ఈ ఫంక్షన్ కు వస్తాడని గట్టి నమ్మకంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా కొంతమంది మెగా వీరాభిమానులు నిహారికను సినిమాలలో నటించడానికి ఒప్పుకోవద్దు అంటూ నాగబాబును ప్రత్యేకంగా కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే నాగబాబు నిహారిక కేవలం డీసెంట్ సినిమాలలోనే నటిస్తుందని ఆ సినిమాలలో ఎటువంటి అసభ్య సన్నివేశాలు ఉండవని నాగబాబు ఎంత సద్ది చెప్పినా కొందరు మెగా వీరాభిమానులు నాగబాబు మాటలను పూర్తిగా నమ్మలేకపోయారనే విషయాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక కధనంలో వివరించింది.

గతంలో సూపర్ స్టార్ కృష్ణ తన కుమార్తె మoజులను సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి  అంగీకరించిన సమయంలో అభిమానుల మాటను గౌరవించి మంజుల సినిమా ఎంట్రీని ఆపుచేసిన విషయాన్ని కూడ మెగా అభిమానులు నాగబాబు దృష్టికి తెచ్చినా అప్పటి పరిస్థుతులకు ఇప్పటి పరిస్థుతులకు ఎన్నో మార్పులు వచ్చాయని నిహారికను కేవలం హుందాతో కూడిన పాత్రలకే పరిమితం చేస్తామని నాగబాబు అనేక విధాలుగా తమ మెగా కుటుంబ అభిమానులకు సద్ది చెప్పినట్లు టాక్. అయితే మెగా ఫ్యామిలీ నిహారిక విషయంలో ఇదే పద్దతిని చివరి వరకు కొనసాగించి ఆమెకు ఎంత వరకు మద్దతుగా ఉంటుంది అన్న విషయం పై ఈరోజు ఆ ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ప్రచురించిన విశ్లేషణ అత్యంత ఆశక్తి దాయకంగా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: