తెలుగు ఇండస్ట్రీలో పరాజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు.. తెలుగు చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకు ఏ సినిమా చేయని సెన్సేషనల్ రికార్డు ‘బాహుబలి’ చిత్రం చేసింది.. ఈ సినిమా కోసం రాజమౌళి రెండున్నర సంవత్సరాలు రెండు వందల కోట్లతో ఎంతో శ్రమించి తీశారు. అందుకు ఈ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని భార దేశంలో అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న రికార్డులను తిరగరాసింది. దాదాపు రూ.600 కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేసింది.   


తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి ఇక తెలుగు ఇండస్ట్రీకి రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. మగధీర, ఈగ, బాహుబలి వంటి సినిమాలను తీసి తెలుగు సినిమా దర్శకుడి సత్తాని ప్రపంచానికి చాటిన దర్శకరత్న, తను చేసింది కొన్ని సినిమాలే అయిన ఒక్క పరాజయం లేకుండా ప్రేక్షకుల మనసుకు నచ్చేవిధంగా, విమర్శకులు కూడా మెచ్చే విధంగా సినిమాలను తీస్తూ ఏ దర్శకుడికి లేని అభిమాన జనాన్ని సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి.


హిస్టారికల్ , కామెడీ , టెక్నికల్ ఇలా ఎలాంటి సినిమా అయిన అద్భుతంగా తీయగాలడనే పేరు తెచ్చుకున్నాడు. లుగు సినిమా స్థాయిని , క్రియేటివిటిని , కమర్షియల్ రేంజ్ ని పెంచిన దర్శకుడు రాజమౌళి.యువ హీరోలు అయిన నితిన్ , ప్రభాస్ , రవితేజ , రామ్ చరణ్ , సునీల్ , నానిలతో సినిమాలు చేసి వరుస విజయాలు అందుకున్నాడు. రాజమౌళి 2009 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలసి రూపొందించిన ‘మగధీర’ సినిమా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డు ని సృష్టించింది. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి ఈయకు వరుసకు అన్న అవుతారు.


షూటింగ్ లో రాజమౌళి గుర్రపు స్వారీ


ఒక సందర్భంగా కీరవాణి తన తమ్ముడు రాజమౌళి గురించి మాట్లాడుతూ... రాజమౌళి చేసే ప్రతి సినిమాలోను సంగీత దర్శకుడిగా తాను కొనసాగుతున్న విషయం పై క్లారిటీ ఇస్తూ తన సినిమాల విషయంలో తాను మంచి సంగీతం అందిస్తాననే  నమ్మకంతో రాజమౌళి తనతో అన్ని సినిమాలలో చేస్తున్నాడు కాని తాను రాజమౌళికి అన్నయ్య అనే భక్తి భావంతో తనతో పాటలు చేయించుకోవడంలేదు ఏ విషయంలో కాంప్రమేజ్ కాడు. అందుకే వరుస విజయాలతో , తెలుగులో అపజయం ఎరుగని దర్శకుడిగా జైత్రయత్రని కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు..ఏపీహెరాల్డ్.కామ్ తరుపు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: