మూడు సంవత్సరాలు సుధీర్ఘ ప్రయాణం తరువాత రిలీజ్ అయిన మూవీ రుద్రమదేవి. ప్రస్తుతం రుద్రమదేవి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రుద్రమదేవి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి అందుతుంది.


ప్రేక్షకులు ఈ మూవీని చూడటానికి స్పెషల్ టైం ని కేటాయిస్తున్నారు. ఇక ప్రతి మూవీ నిర్మాతకి ఓవర్సీస్ కలెక్షన్స్ అనేవి భోజనం చేసిన తరువాత తినే స్వీట్ లాంటిది. అందుకే ఓవర్సీస్ ని నిర్మాతలు ఎక్కువుగా టార్గెట్ చేస్తుంటారు. ఇక ఓవర్సీస్ లో ఓ మూవీ హిట్టా?ఫట్టా? అనేది తెలియాలంటే..., ఆ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోల కలెక్షన్స్ బట్టి చెప్పేయచ్చు.


రుద్రమదేవి మూవీ యు.ఎస్ లో దాదాపు 150 స్ర్రీన్స్ లలో ప్రీమియర్ షోల ప్రదర్శన జరిగింది. అలా ప్రీమియర్ షో ల ద్వారా వచ్చిన కలెక్షన్స్ దాదాపు 83 లక్షల రూపాయలు. ఇంతటి పెద్ద మొత్తంలో ప్రీమియర్ కలెక్షన్స్ ని రాబట్టింది కాబట్టి, కచ్ఛితంగా రుద్రమదేవి మూవీ హిట్ ని సాధించినట్టే.


ఇక మొదటి రోజు ముగిసిన తరువాత రుద్రమదేవి ఓవర్సీస్ కలెక్షన్స్ దాదాపు మూడున్నర కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. ఈ రకంగా రుద్రమదేవి మూవీ ఓవర్సీస్ లో భారీ విజయాన్ని కైవసం చేసుకోవటం ఖాయం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: