న్యూస్ ఛానల్స్ కి సంబంధించిన ఎడిటర్స్ అంటే ఎలా ఉంటారు? వారు ఏ విషయాన్నైనా అనర్గలంగా మాట్లాడగలగాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మార్పుని వారు పసిగడుతూనే ఉండాలి. ముఖ్యంగా వారి చుట్టు జరుగుతున్న పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కానీ, తెలుగు న్యూస్ ఛానల్స్ కి చెందిన ఓ ఎడిటర్, సినిమాలపై బిగ్ స్టోరిని పెట్టి,  సబ్జెక్ట్ తెలియకపోవటంతో ఇరుకున పడ్డారు.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రయుఖ న్యూస్ ఛానల్ ఎడిటర్, రుద్రమదేవి మూవీ రీలీజ్ రోజు, ప్రైం టైంలో మూవీలకి సంబంధించిన డిబేట్ ని పెట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తులు, నిర్మాతలు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. అయితే మూవీలపై పెరుగుతున్న బడ్జెట్, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత వరకూ శ్రేయస్కరం? లాటరీతో సినిమాలను నిర్మిస్తున్నారా? అనే కోణంతో సాగిన ఈ డిబేట్ లో ఎడిటర్ వద్ద సరైన సమాచారం లేకపోవటంతో,  చూసే ప్రేక్షకులకి అది పెద్ద ఆసక్తికరంగా లేదు.


తను ప్రశ్న అడుగుతూనే, నిజమో కాదో నాకు తెలియదు అంటూ ఎడిటర్ పదే పదే చెప్పటంతో... గెస్ట్ లు సైతం వాటికి ఎటువంటి జావాబులు చెప్పాలో అర్ధం కాలేదు. మొత్తంగా డిబేట్ ని మేనేజ్ చేసిన ఎడిటర్ కి, మరోసారి ఇలాంటి  సబ్జెక్ట్ ని ఎంచుకోకుడదు అనే విషయం తెలిసి ఉంటుంది. మూవీ ఆడియో ఫంక్షన్స్ ని నిర్మాతలు నిర్వహిస్తారా? ఈవెంట్స్ వారు నిర్వహిస్తారా? అయితే ఇందులో ఖర్చు ఎవరికి ఎంత ఉంటుంది? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు.


కానీ ఆ ఎడిటర్ కు ఆడియో ఫంక్షన్స్ లో నిర్మాతల వ్యవహారం ఎంత వరకూ అనేది తెలియక సరైన ప్రశ్నలను అడగలేకపోయారు. సినిమాల్లో పాటలు అవసరమా? అనే పాయింట్ ని రైజ్ చేసి, దాన్ని సరిగా డిస్కస్ చేయలేకపోయారు. తను సెలక్ట్ చేసుకున్న టాపిక్ పై ఎడిటర్ దగ్గర సరైన సమాచారం లేకపోవడంతో, కొన్ని అవగాహనలేమి ఇందులో స్పష్టంగా కనిపించింది. మొత్తంగా ఈ డిబేట్ ని కూడ సాధారణ డిబేట్స్ లాగే నడిపంచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: