తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు..తర్వాత తనకంటూ మంచి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ మొదట్లో లావుగా ఉండేవారు..కానీ ఫైట్లు, డ్యాన్సులు బాగానే చేసేవారు.. రాఖీ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘యమదొంగ’ చిత్రం వచ్చింది..ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టయిల్ పూర్తిగా మారిపోయింది..సన్నగా కరెంటు తీగలా తయారయ్యాడు..దీనికి కారణం రాజమౌళి అని చెప్పారు ఎన్టీఆర్.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. అందే కాదు ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని బయటకు లాగాడు రాజమౌళి. పౌరాణిక పాత్రలకు కూడా ఎన్టీఆర్ అద్భుతంగా పండిస్తాడని రుజువు చేశారు.

తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాలేదు. ఇకపోతే ‘బాహుబలి’ చిత్రంతో తెలుగోడి సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు రాజమౌళి. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం వసూళ్లు చేయని చేయలేని విధంగా ఈ సినిమా రూ. 600 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం రాజమౌళి  ‘బాహుబలి 2’ షూటింగ్ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ మరో సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.. రాజమౌళి బాహుబలి 2 కంప్లీట్ కాగానే వెయ్యి కోట్ల బడ్జెతో భారీ ఎత్తున సినిమా తీయబోతున్నారట..ఆ సినిమా పేరు ‘గరుడ’. ఇప్పటికే ఆయన తండ్రి  విజయేంద్ర ప్రసాద్ గరుడ కి  కథ తయారు చేసే పనిలో ఉన్నాడట.

బాహుబలి -2 కంప్లీట్ కాగానే రాజమౌళి గరుడ సినిమా సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ ఇంత పెద్ద ప్రాజెక్టు పనిలో హీరో కూడా అదే స్థాయిలో ఉండాలనే ఆలోచనతో మహేష్ బాబుని తీసుకోవాలని అనుకున్నారట.. అయితే  ఆ ప్రాజెక్ట్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వచ్చి చేరింది.  ఎన్టీఆర్ మెయిన్ రోల్ చేస్తాడని , మలయాళ  సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తాడని కొత్తగా ఫిలిం నగర్ లో టాక్ వినబడుతోంది.

చారిత్రక ఇతిహాసాలు సారంశంతో సినిమాలు తీయడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. గడరు చిత్రం కూడా ‘మహాభారతం’ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. మరి వెయ్యికోట్ల బడ్జెట్ తో సినిమా అంటే అంత సింపుల్ మ్యాటర్ కాదు..ఆ రేంజ్ లో తెలుగు ఇండస్ట్రీ ఆలోచనలు కూడా పెట్టుకోలేదు..కానీ బాహుబలి సినిమా హిట్ తర్వాత వందా,రెండు వందల కోట్ల బడ్జెట్ కామన్ అయ్యిపోయాయట. ఆ మద్య ‘బ్రూస్ లీ’ సినిమా ఆడియో ఫంక్షన్ లో యాంకర్ సుమ ఓ సందర్భంలో నిర్మాత అల్లు అరవింద్ ని చిరంజీవి 151 సినిమాకు రెండు వందల బడ్జెట్ తో తీయాలని అన్పుడు అరవింత్ ఆయన ఒప్పుకోవాలే కానీ మూడు వందల కోట్లతో అయినా ఇప్పుడు రెడీ అని అన్నారు.  

యమదొంగ ఫ్యాన్స్ పోస్టర్


బాహుబలి పార్ట్ 2 కనుక  మంచి హిట్ అయి 1000 కోట్ల కలెక్షన్ ల మార్క్ చేరగలిగితే,  ఈ గరుడకి అంత బడ్జెట్ పెట్టేందుకు ప్రొడ్యూసర్లు  ముందుకు వస్తారు అని కొందరు అంటున్నారు. అన్నీ కుదిరి వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్, మోహన్ లాల్ లాటి నటులు నటిస్తే ఆ సినిమా తెలుగు,హింది,తమిళ ఇండస్ట్రీలనే కాదు హాలీవుడ్ ని కూడా షేక్ చేయించడం ఖరారు అని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: