మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగాన్ని మహారాజుల ఏలిన చిరంజీవి సినిమాలలో నటించకపోయినా ఆయనను అభిమానించే కోట్లాదిమంది ప్రజానీకం ఉన్నారు. దాదాపు 8 సంవత్సరాల తరువాత మేకప్ వేసుకుని తన కొడుకు రామ్ చరణ్ కోసం తిరిగి ‘బ్రూస్ లీ’ రంగ ప్రవేశం చేస్తున్నాడు చిరంజీవి. చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ తమిళంలో కూడ డబ్ చేయబడి విడుదల కాబోతోంది. 

ఈ సందర్భంగా ‘బ్రూస్ లీ’ తమిళ ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ ఫంక్షన్ కు లారెన్స్ అతిధిగా వచ్చి రామ్ చరణ్ కు సంబంధించిన ఒక సీక్రెట్ బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. చిరంజీవి సినిమాలు అంటేనే డాన్స్ లు. ఆ డాన్స్ మూమెంట్స్ చిరంజీవిని మెగా స్టార్ గా మార్చాయి. అటువంటి టాప్ హీరో చిరంజీవికి రామ్ చరణ్ సినిమాలలోకి రాకముందు చరణ్ డాన్సర్ గా అందర్నీ ఆకట్టుకోగాలడా అనే టెన్షన్ పడేవాడట. 

ఈవిషయాన్ని స్వయంగా లారెన్స్ బయట పెట్టాడు. ‘ఇంద్ర’ సినిమాలో ‘దాయి దాయి దామ్మా’ పాటకు స్టెప్స్ కంపోజ్ చేయిస్తున్నపుడు చరణ్ తన తండ్రి చిరంజీవి పక్కనే ఉన్న సందర్భంలో ఒకసారి ఆ పాటను చరణ్ తో డ్యాన్స్ చేయించి చూడమని తనతో చెప్పి ఒక గదిలోకి పంపించిన సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు లారెన్స్. 

ఆ గదిలో తాను చరణ్ కు డాన్స్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు చిరంజీవి చాల టెన్షన్ పడుతూ ‘చరణ్ పనికొస్తాడా పనికొస్తాడా’ అంటూ చాలా టెన్షన్ గా అడిగినప్పుడు మీ అబ్బాయి ఎదో ఒకరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీని దుమ్ము దులుపుతాడు అని చిరంజీవితో అన్నానని తన మాటలు నిజం చేస్తూ చరణ్ టాప్ హీరోగా మారడమే కాకుండా మంచి డాన్సర్ గా మారడం చిరంజీవికే కాదు తనకు కూడ ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ కామెంట్స్ చేసాడు లారెన్స్. ‘బ్రూస్ లీ’ సినిమాలో చరణ్ స్టెప్స్ అదిరిపోయాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చరణ్ డాన్స్ లకు మంచి పేరు వస్తే అప్పట్లో చిరంజీవి పడ్డ టెన్షన్ కు ఈనాటికి ఫలితం దక్కింది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: