యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏమోషన్ని ఇప్పుడున్న హీరోల్లో పీక్స్ స్టేజ్ కి తీసుకెళ్లగలిగే ఏకైక హీరో.. అయితే ఎన్టీఆర్ తో ఒక్కసారి సినిమా చేయడానికి చాలా మంది క్యూలో నిలబడి ఉన్నారు. ముఖ్యంగా కొత్త తరానికి అవకాశం ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కొరటాల శివతో చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. తన చేసిన చాలా సినిమాలకు కథ అందించిన స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఎప్పటినుండో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. 


ఎన్టీఆర్ కూడా మొన్నామధ్య స్క్రిప్ట్ విని ప్రొసీడ్ అవ్వమని సిగ్నల్స్ ఇచ్చాడట. ప్రస్తుతం శ్రీమంతుడు హిట్ తో మంచి ఫాంలో ఉన్న కొరటాల కాంబినేషన్లో సినిమా ముందు ఉండనున్నది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఖచ్చితంగా వక్కంతం దర్శకత్వంలోనే సినిమా చేసే ఛాన్స్ ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. 2016 ద్వితీయార్ధంలో ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతుందట. స్వతహాగా ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన వక్కంతం వంశీ ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తే బాగుంటుందో సరిగ్గా అలాంటి వెపన్ లాంటి సబ్జెక్ట్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడట.


అయితే వంశీ సినిమా గురించి అఫిషియల్ గా మాత్రం ఎనౌన్స్ రాలేదు. ఈలోపు ఎన్టీఆర్ వేరే కథ ఏమన్నా నచ్చితే మళ్లీ వంశీ సినిమా వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. నాన్నకు ప్రేమతోలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమాను వచ్చే సంక్రాంతికి బరీలో దించుతున్నాడు.


మరి వక్కంతం వంశీ సినిమా ఈసారైనా ఓకే అయ్యి సినిమా పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అసలే తెలుగు తలైవా అని నానా హడావిడి చేస్తున్న ఎన్టీఆర్ రాబోతున్న వంశీ సినిమాతో నిజంగానే ఓ రేంజ్ హిట్ కొట్టాలని కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: