ఇప్పుడు ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నారు. భూమి నుంచి అంతరిక్షయానం వరకు అన్నింటిలోనూ తాము తక్కువేమీ కాదు అని నిరూపిస్తున్నారు.  తాజాగా భారత సంతతికి చెందిన మహిళ స్వాతి దండేకర్ ఏసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) డైరెక్టర్ గా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండో-అమెరికన్ స్వాతిని ఏడీబీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1951 మార్చ్ 6న స్వాతి దండేకర్‌ జన్మించారు. 1972లో అరవింద్‌ దండేకర్‌తో ఆమెకు వివాహమైంది. యూనివర్శిటీ ఆఫ్‌ ముంబై, రాష్ట్రసంత్‌ టుకదోజీ మహరాజ్‌ నాగ్‌పూర్‌ యూనివర్శిటీలో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ, ముంబై వర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. 


2003-2009 మధ్య దిగువ సభ సభ్యురాలిగా, 2009-11 మధ్యకాలంలో దిగువ సభ సెనెట్ సభ్యురాలిగా విధులు నిర్వర్తించారు. అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లకు ధీటుగా ఆమె పనిచేస్తుందని భావిస్తున్నట్లు ఒబామా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న రాబర్ట్ ఎం ఓర్ర్ స్థానంలో స్వాతి దండేకర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: