గత కొంత కాలంగా అమెరికాలో భారతీయుల పట్ల ఏర్పడ్డ సంక్షోభానికి తెలిందే..ఈ మద్య కాలంలో అక్కడ ఉన్న విద్యార్థులపట్ల వివక్షత కూడా చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా  అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న దాదాపు 50 లక్షల మంది విదేశీయులకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని సమీక్షించేందుకు యూఎస్‌ సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే వచ్చే సంవత్సరానికి అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాట్లు తెలిసింది. ముఖ్యంగా వలస వచ్చిన వారే ఎన్నుకునే వారిలో కీలకం కావున గత కొంత కాలంగా దీనిపై వివాదం నెలకొంది.

దీంతో అమెరికాలో వలస వచ్చిన వారికి సుమారు 50 లక్షల మంది విదేశీయులకు చట్టబద్దత కల్పించాలనే యోచనలో యూఎస్‌ సుప్రీంకోర్టు ఉన్నట్లు సమాచారం. అక్రమంగా నివాసం ఉంటున్న వారందరినీ చట్టబద్దం చేసేందుకు ఒబామా తన ఎగ్జిక్యూటివ్‌ అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించటంపై దిగువ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థనతో దీనిపై సమీక్షించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. ఏప్రిల్‌లో ఈ కేసు విచారణ జరగనుండగా, జూన్‌ చివరికల్లా తీర్పు వెలువడనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: