భారత దేశంలో చదువుకొని ఉన్నత విద్యలకోసం చాలా మంది అమెరికా పయనమవుతుంటారు. అక్కడ విద్యాబుద్దులు నేర్చుకొని తిరిగి భారత్ కు రావడం ఉన్నత ఉద్యోగాల్లో చేరడం లాంటివి జరుగుతుంటాయి. ఇక భారత్ లో ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లే విద్యార్థులక కోసం  విదేశీ వ్యవహారాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం, అమెరికా రాయబార కార్యాలయ అధికారులు సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టునున్నట్టు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ తెలిపారు.


ఆ మద్య యూఎస్ లో బోగ కళాశాలలు వెలిశాయని చాలా మంది విద్యార్థులు డబ్బులు కట్టి నష్టపోవడంతో ఇప్పుడు తల్లిదండ్రులు విద్యార్థులను పంపించడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. గత నెలలో చాలా మంది విద్యార్థులు వెను తిరిగి రావడం కూడా జరిగింది. దీంతో భారత రాయభార వ్యవస్థపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రామచంద్రు తెజావత్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ గత రెండురోజులుగా విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, అమెరికా డివిజన్ డైరెక్టర్‌తో చర్చించారు.


ఎయిర్ పోర్ట్ లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు


వీసా మంజూరైన తర్వాత విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించకపోవడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని తెలంగాణ ప్రతినిధులు స్పష్టం చేశారు. యూఎస్ వెళ్లే విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: