అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసుకు పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు న్యూ హ్యాంప్‌షైర్‌లో అనూహ్య మెజారిటీ దక్కింది. ఐయోవా నగరంలో జరిగిన పార్టీ ఎన్నికలలో ఎదురు దెబ్బ తగిలినా, న్యూహాంప్‌ షైర్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా డోనాల్డ్ ట్రంప్ నెగ్గారు.దీంతో ఆయన మద్దతుదారులలో ఉత్సాహం వచ్చింది.ఇక డెమోక్రటిక్ అభ్యర్థిగా సేనేటర్ బెర్నీ సాండర్స్ గెలుపొందారు. ఆసక్తికరంగా జరిగిన రేసులో బిలియనీర్ డోనాల్డ్ ట్రంప్ తన సమీప అభ్యర్థి కన్నా రెండు రేట్ల ఎక్కువ ఓట్లు చేజిక్కించుకున్నారు.

సాండర్స్ కూడా భారీ తేడాతోనే హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అమెరికాలో హల్ చల్ చేస్తున్న ట్రంప్ ఐయోవాలో ప్రత్యర్ది ట్రెడ్ క్రజ్ లీడ్ పొందారు.రిపబ్లికన్ పార్టీలో జాన్ కాషీ రెండో స్థానంలో, జెబ్ బుష్ మూడో స్థానంలో నిలిచారు. గత వారం ఐయోవా రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐయోవాలో ఆమె ఆదిక్యత సాదించగా, ఇక్కడ మాత్రం బెర్రీ సాండర్స్ ఆదిక్యత సాధించారు.


ముందుగా ఆయా పార్టీల తరపున ఆధిపత్యం సాదిస్తే వారు అద్యక్ష పదవికి పోటీచేసే అవకాశం ఉంటుంది.తెలిసిందే. ప్రైమరీ ఎన్నికల క్రమంలో న్యూ హ్యాంప్‌షైర్ రెండవ రాష్ట్రం కావడం విశేషం. ఆ తర్వాత దక్షిణ కెరోలినా, నెవడా రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: