భారత దేశంలో దేశభక్తి గీతం ‘జన గణ మన’ అంటే ఎంతో గౌరవం ఇస్తాం. తాజాగా ఈ గీతాన్ని అమెరికాలో చిన్నారులు పాడి అబ్బుర పరిచారు. అమెరికా జాతీయ దినం సందర్భంగా అమెరికన్ అధికారుల పిల్లలు భారతీ జాతీయ గీతం ‘జన గణ మన’ పాడారు. అయితే ఇదంతా జరిగింది అమెరికాలో మాత్రం కాదు..మహారాష్ట్రలోని ముంబాయిలో. అక్కడ అమెరికన్ కాన్సులేట్ లో ఇటీవల జరిగిన అమెరికా దినోత్సవ వేడుకలు ఇందుకు వేదికైంది.

కాన్సులేట్ అధికారుల పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి భారతీ జాతీయ గీతం ఆలపించడం పలువురిని ఆశ్చర్య పరిచింది. భారత్-అమెరికా దేశాల మద్య సత్సంబంధాల ప్రాధాన్యతను తెలియజెప్పడానికి ఈ వేడుకల ప్రాధాన ఉద్దేశ్యమని అమెరికా కాన్సులేట్ జనరల్ టామ్ వాజ్డా అన్నారు. ఈ కార్యక్రమంలో మహరాష్ట సీఎం దేవేంద్ర ఫడణవీన్, మిస్ అమెరికా 2014 భారత సంతతికి చెందిన సైనా దావులూరి కూడా హాజరయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: