తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ కనక దుర్గమ్మ అంటే చాలా ఫేమస్ అని తెలులు..అయితే ఇప్పుడు అమ్మవారికి అమెరికాలో దుర్గమ్మ పూజలు నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. బెజవాడ కనక దుర్గమ్మఏప్రిల్‌ 22 నుంచి మే 22 వరకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో వారానికి రెండు రోజులపాటు త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం, శ్రీచక్ర నవావరణార్చన పూజలు చేయనున్నారు.

రోజూ కనీసం 300 నుంచి 500 మంది దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని దేవస్థానం అర్చకులు అంచనా వేస్తున్నారు. ఈ పూజలు నిర్వహించినందుకు దేవస్థానానికి ప్రవాస భారతీయులు రూ.30లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.  దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, అర్చకులు కోట ప్రసాద్, శంకరశాండిల్య, మారుతి యజ్ఞ నారాయణశర్మ, అమ్మవారి అలంకారం చేయడానికి పరిచార కుల  శంకరమంచి ప్రసాద్, కె.గోపాలకృష్ణ తదితరులు ఏప్రిల్ 18న అమెరికా వెళ్లనున్నారు.

పూజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు లాస్‌ఏంజిల్స్ లేదా టెక్సాస్‌లో దేవాలయం నిర్మించేందుకు ముందుకు వచ్చారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రస్తుతం పూజలు నిర్వహించడం వల్ల దేవాలయ నిర్మాణానికి మరింతమంది దాతలు ముందుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: