దేశభాషలందు తెలుగు లెస్స.. అని భారత దేశంలో ఉంది. తెలుగు భాష అంటే చాలా మందికి మక్కువే. ఇక విదేశాల్లో స్థిరపడిన వారు మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారు. అమెరికాలో భారతీయులు తెలుగు భాష అభివృద్ది కోసం ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి విద్యార్థులకు సిలికానాంధ్ర మనబడి ద్వారా విజయవంతంగా  తెలుగు నేర్పిస్తున్నారు. అంతే కాదు  మనబడి ప్రచార కార్యక్రమంలో భాగంగా, న్యూజెర్సీ-న్యూ యార్క్  ప్రధాన రహదారిపై 60 అడుగుల మనబడి హోర్డింగ్‌తో ఆకట్టుకుంది.

ప్రతీ రోజూ వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారి న్యూ యార్క్ విమానాశ్రయానికి  అతి దగ్గరగా ఉండడం, అత్యంత భారీ సంఖ్యలో భారతీయులు ప్రయాణం చేసే మార్గం అవడం వల్ల – ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసామని మనబడి ఉపాద్యక్షులు ( గ్లోబల్) శరత్ వేట తెలిపారు. ఇక అమెరికాలో తెలుగు భాష పై మక్కువతో ఇక్కడ విద్యార్థులచే పద్యాలు, పాటలు, ప్రవచనాలు,శ్లోకాలు లాంటివి పటించేలా చేస్తున్నారు.  మనబడి అద్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ..తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన తెలుగు భాషా బోధనా కార్యక్రమాలలో అత్యంత విజయవంతమైన మనబడి వార్షిక పరీక్షలు మరి కొద్ది రోజుల్లో జరగనున్నాయని, త్వరలో 2016-17 విద్యా సంవత్సరం తరగతులు ప్రారభమవుతాయని అన్నారు.

60 అడుగుల ఈ హోర్డింగ్‌ 


60 అడుగుల ఈ హోర్డింగ్‌లో తెలుగుతనం ఉట్టిపడే బాపు బుడుగు, సీగాన పెసూనాంబల బొమ్మలు ఉపయోగించారు. న్యూజెర్సీ వాసులు ఈ ప్రధాన రహదారిపై తెలుగు లో ప్రచారం చిత్రాలు చూడడం పట్ల తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.  తెలుగు భాష నేర్చుకోవడానికి చేర్చుకోవలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మనబడి ఆర్ధిక వ్యవహారాల ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: