మనిషి జీవితంలో ఎన్నో సాధించాలని ఉన్నత స్థానంలోకి వెళ్లాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎన్నో వడిదుడుకులు ఎదురౌతుంటాయి..వాటిని ఎదుర్కొని జీవితంలో పోరాడితే జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది..కానీ కొంత మంది జీవితంలో వచ్చే వడిదుడుకులకు తట్టుకోలేకి అర్ధాంతరంగా తనువు చాలిస్తుంటారు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాకు చెందిన ఓ ఉన్నతాధికారి జీవితంపై విరక్తి చెంది తాను వుంటున్న బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే..ఇంటర్నేషనల్ కంపెనీ బ్రిటానికా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వినీత్‌ వింగ్ (47)  బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం వింగ్ ఎన్‌సైక్లోపేడియా బ్రిటానికా కంపెనీకి దక్షిణాసియా డివిజన్‌కు సీవోవోగా వ్యవహరిస్తున్నాడు. నన్ను క్షమించండి, ఆత్మహత్య తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అవును, నేను పిరికివాడినే.

సవాళ్లను ఎదుర్కోవాల్సిందే కానీ జీవితం చాలిస్తున్నాను అని రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నొయిడాలోని డీఎల్ఎఫ్ బెల్వెడెరే పార్క్‌ సొసైటీలో తండ్రి, భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో వినీత్ ఉంటున్నాడు. మరోవైపు వినీత్ ఆత్మహత్య వార్త తెలియగానే అతడి తండ్రి గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: