చికాగోలో తెలుగు వాళ్లు అందరూ కలిసి స్థాపించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట) ఇప్పటి వరకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా తెలుగు అభివృద్ది, సాంస్కృతిక , కళారంగానికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టింది. అమెరికాలో ఉంటూ తెలుగు వారి ఔన్నత్యం గురించి అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. తాజాగా అమెరికా తెలుగు సంఘం(ఆటా) ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా ఆటా వార్షిక సదస్సుకు రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు.

చికాగోలో జూన్‌ 1 నుంచి 3 వరకు ఆటా మహాసభలు జరుగుతాయని వారు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో వారు సీఎం కేసీఆర్ ను కలిశారు.

ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న ఆట ప్రతినిధులు


ఆటా వ్యవస్థాపకులు హన్మంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్, ఎలక్ట్ ప్రసిడెంట్ కరుణాకర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఏనుగు లక్ష్మణ్ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. వారి ఆహ్వానంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: